Salaar- KGF: కెజిఎఫ్ రాఖీ భాయ్ మరణానికి సలార్ టీజర్ కి సంబంధం ఏంటీ… మతిపోగొట్టే డిటైల్స్, ప్రశాంత్ నీల్ అలా సెట్ చేశాడా?

ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ రీత్యా ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు పడితే సినిమా ఊహకు కూడా అందదని ఫ్యాన్స్ గట్టి నమ్మకం. అందుకే సలార్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సలార్ టీజర్ కోసం అభిమానులతో పాటు చిత్ర వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ కెజిఎఫ్ చిత్ర కథతో సలార్ కి లింక్ ఉంటుంది. ఇది కెజిఎఫ్ వర్స్ లో భాగమనే ఓ వాదన కూడా ఉంది.

Written By: Shiva, Updated On : July 4, 2023 8:41 am

Salaar- KGF

Follow us on

Salaar- KGF: సలార్ టీజర్ విడుదలకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా అంచనాలున్న ఈ మూవీ బాక్సాఫీస్ దున్నేస్తుందని ట్రేడ్ వర్గాల వాదన. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సిరీస్ తో మాస్ ఆడియన్స్ కి ఎవర్ గ్రీన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. కెజిఎఫ్ 2 అయితే వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వసూళ్లు సాధించింది. మరోవైపు ప్రభాస్ బాహుబలితో ఇండియా లోనే అతిపెద్ద హీరోగా అవతరించారు.

ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ రీత్యా ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు పడితే సినిమా ఊహకు కూడా అందదని ఫ్యాన్స్ గట్టి నమ్మకం. అందుకే సలార్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సలార్ టీజర్ కోసం అభిమానులతో పాటు చిత్ర వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ కెజిఎఫ్ చిత్ర కథతో సలార్ కి లింక్ ఉంటుంది. ఇది కెజిఎఫ్ వర్స్ లో భాగమనే ఓ వాదన కూడా ఉంది.

ఇదే సందేహం మేకర్స్ ని అడిగితే స్పష్టంగా చెప్పడం లేదు. సినిమా చూసి మీరే తెలుసుకోండి అంటున్నారు. సలార్ టీజర్ తో ఒక క్లారిటీ వస్తుందనే భావన ఉంది. అయితే సలార్ టీజర్ డేట్ అండ్ టైం ఫిక్స్ కాగా, ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ వెలుగులోకి వచ్చింది. సలార్ టీజర్ జులై 6న ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. నిజానికి సినిమా అప్డేట్స్ ఉదయం పది తర్వాత సాయంత్రం 7 గంటలకి ముందు విడుదల చేస్తారు. అనూహ్యంగా సలార్ టీజర్ తెల్లవారుజామున వస్తుంది.

ఉదయం 5:12 నిమిషాలకు కెజిఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ కి లింక్ ఉంది. రాఖీ భాయ్ మీద సముద్రంలో అటాక్ జరిగేది అదే సమయానికి, ఆ సన్నివేశంలో ఓ గడియారం ఈ సమయం చూపిస్తుంది. రాఖీ భాయ్ మీద అటాక్ జరిగే టైం కి సలార్ టీజర్ రిలీజ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ప్రశాంత్ నీల్ ఏదో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ సిద్ధం చేశాడంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే సలార్ టీజర్ విడుదల కావాలి. ఇక సలార్ వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

https://twitter.com/Nani____3/status/1675816001257222144?t=ZVCvlje2kVBiXaiX61M-uA&s=08