HomeతెలంగాణKTR CM Candidate: *సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోలేని స్థితిలో కేటీఆర్‌.. ఎందుకిలా*

KTR CM Candidate: *సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోలేని స్థితిలో కేటీఆర్‌.. ఎందుకిలా*

KTR CM Candidate: తెలంగాణలో కాంగ్రెస్‌« అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. తెలంగాణను సాధించి.. రాష్ట్రాన్ని తొమ్మిదిన్నరేళ్లు పాలించిన కేసీఆర్‌ను కొట్టడం ఎవరికీ సాధ్యం కాదనుకున్నారు. కేసీఆర్, కేటీఆర్‌ కూడా బీజేపీపై ఫోకస్‌ పెట్టారు. కానీ రేవంత్‌రెడ్డి బాహుబలిలా షాక్‌ ఇచ్చాడు. బలమైన కేసీఆర్‌ను ఒంటిచేత్తో ఓడించాడు. రెండున్నరేళ్లుగా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో కేజీఆర్‌ రాజకీయ జోష్యాలు చెబుతూ మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అంటూ చెప్పుకుంటున్నారు. ఇవి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నాయి.

వైఫల్యాలపై ఆధారపడి..
రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదని, తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ పాలనను పోల్చి చూసుకుంటున్నారని పేర్కొంటున్నారు. మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధిలో రేవంత్‌ సగం కూడా చేయలేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయన్న ధీమా కేటీఆర్‌లో కనిపిస్తుంది. కానీ, రెండున్నరేళుల ఫామ్‌హౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌.. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌ అయ్యే పరిస్థితిపై సందిగ్ధం నెలకొంది. కేసీఆర్‌ను ఇక శాశ్వతంగా ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని రేవంత్‌ అంటున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రకటించుకునే పరిస్థితి లేక..
ఎన్నికలు కేవలం ప్రత్యర్థి అనుభవ లోపాలపై ఆధారపడి జరుగవు. నాయకత్వం, కమ్యూనికేషన్, స్థానిక శ్రేణులలోని శక్తి సమీకరణం, సందర్భోచిత సంఘటనలు కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి కాంగ్రెస్‌ విఫలమైందనే కారణంతో బీఆర్‌ఎస్‌ నిర్బంధ విజయమనే జోస్యం తాత్కాలికమే. కేసీఆర్‌ కూతురు పార్టీ నుంచి బయటకు వచ్చి ధైర్యంగా రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్‌ మాత్రం ఇప్పటికీ తండ్రి పేరు చెప్పుకుంటున్నారు. కేసీఆరే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. తనను తాను సీఎంగా ప్రొజెక్టు చేసుకోలేకపోతున్నారు.

బీఆర్‌ఎస్‌ కుటుంబ రాజకీయాలు..
బీఆర్‌ఎస్‌కి పెద్ద పట్టు ఉన్నా, కుటుంబ రాజకీయాలకు సంబంధించిన అనుబంధ, అంతర్గత విభాగాల ఒత్తిళ్లు, కవిత వంటి నాయకత్వ కొత్త అంశాలు పార్టీకి కొత్త సవాళ్లు తీసుకురావచ్చు. ఒక పార్టీకి నిరంతరంగా అధికారంలో ఉండటానికి సమర్థ నాయకత్వానికి తోటి స్థాయి వ్యూహపరమైన నవీనత, యువ శ్రేణుల ఆకర్షణ, పాలనా ప్రదర్శనలో నిరంతర ఉత్తేజం అవసరం. బహుశా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కీలకంగా కనిపించినా, గెలుపు హామీ సులభంగా చెప్పలేం.

బీజేపీ వ్యూహం..
తెలంగాణలో బీజేపీ ప్రభావం కూడా పెరిగింది. కేంద్ర స్థాయి మద్దతు, వనరుల వినియోగం, స్థానిక మద్దతుదారుల ఆకర్షణ వ్యూహాలు చివరికి స్థానిక బలహీనతలను ఉపయోగించవచ్చు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటోంది. బెంగాల్‌ తర్వాత తెలంణపై ఫోకస్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ వైఫల్యాలను నమ్ముకోవడం కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాజకీయ స్థితి ఒకే పరీక్ష పెడుతున్న సమయం. ఈ సమయంలో పార్టీని, క్యాడర్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులపై ఉంది. మరో ఏడాది గడిస్తే ఎన్నికల మూడ్‌ వస్తుంది ఆలోగా బలోపేతం కాకుంటే భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version