https://oktelugu.com/

Salaar- KGF: సలార్ కు కేజీఎఫ్ తో సంబంధం? అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్

సెకెండ్ పార్ట్ ఎండింగ్ లో 'కేజీఎఫ్- ఛాప్టర్ 3' ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. అంతే కాదు సినిమా కూడా ముగింపు లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 30, 2023 / 10:15 AM IST

    Salaar- KGF

    Follow us on

    Salaar- KGF: కేజీఎఫ్ సినిమా గురించి గుర్తు చేస్తే ముందుగా యశ్ గుర్తువస్తారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా యశ్ ను, ప్రశాంత్ నీల్ ను ఇండియాకు పరిచయం చేసింది. ఇక ఎటువంటి బజ్ లేకుండా 2018లో.. విడుదలైన కొద్ది రోజుల్లోనే ట్రెండ్ సృష్టించింది కేజీఎఫ్. యావత్ సినీ ఇండస్ట్రీని శాండల్వుడ్ వైపునకు తిప్పింది. యశ్ సినీ కెరీర్ ను ఓ మలుపు తిప్పిన ఈ మూవీ.. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే జోరుతో దర్శకుడు ప్రశాంత్ నీల్ 2022లో ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు. ఇది కూడా మెదటి పార్ట్ కంటే ఎక్కువగా వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ద TOUN గా మారింది. అయితే ఈ చిత్రంతోనే కథ ఓ కొలిక్కి వస్తుందని అనుకుంటే.. సీన్ రివర్స్ అయ్యింది.

    సెకెండ్ పార్ట్ ఎండింగ్ లో ‘కేజీఎఫ్- ఛాప్టర్ 3’ ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. అంతే కాదు సినిమా కూడా ముగింపు లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ షేర్ చేయలేదు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఈ మూవీ గురించి ఎక్కడా కూడా ఊసే లేకుండా పోయింది.

    అయితే 2025లో ‘కేజీఎఫ్-3’ సినిమా రిలీజ్ కానుందని హోంబలే ఫిల్మ్స్ సంస్థకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా కేజీఎఫ్ 3 ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని ఆయన అన్నారు. దీని గురించి అధికారిక ప్రకటనను ఈ ఏడాది డిసెంబర్ 21న చేయనున్నారట. ఇక షూటింగ్ 2024 అక్టోబర్ లో జరగనుండగా.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం.

    రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ టీజర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇంటర్నెట్ ను షేక్ చేసింది. అయితే సలార్ కు మొదటి నుంచే కేజీఎఫ్ 2 తో లిక్ ఉందంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి టీజర్ రిలీజ్ చేసిన సమయం, టీజర్ లో ఒకటి రెండు విజువల్స్, హీరో మాస్ లుక్.. ఇలా కొన్ని విషయాలను గమనిస్తే.. రెండింటి మధ్య ఏదైనా సంబందం ఉందా? అన్న సందేహాలు తప్పకుండా వస్తాయి. టీజర్ లో C-516 కంటైనర్ కేజీఎఫ్-2లోనూ కనిపించింది. కేజీఎఫ్ 2 లో రాకీభాయ్ మీద క్లైమాక్స్ లో జరిగిన దాడి.. తాజాగా సలార్ టీజర్ విడుదలైన టైమ్ కూడా ఒకటే. అయితే కేజీఎఫ్ ముగింపులో, కేజీఎఫ్ 3 ప్రకటన చేసినప్పుడు మిలటరీ బేస్ చూపారు. సలార్ టీజర్ బ్యాకౌ గ్రౌండ్ లో కూడా అదే మిలిటరీ క్యాంపు కనిపిస్తుంది. అంటే కేజీఎఫ్ లో కూడా ఆర్మీ ఉన్నట్టు అర్థం అవుతుంది. అంతేకాదు మిలిటరీ సైనికులు కూడా కనిపిస్తున్నారు. ఇక ఈ సలార్ మిలటరీకి చెందిన వ్యక్తి కావచ్చు అని కొందరి అనుమానం. మరి మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అసలు కథ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.