Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ సినిమా ఇంకా రిలీజ్ అయితే అవ్వడం లేదు. త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే మరొక సినిమాకి కమిట్ అవ్వకుండా డేట్స్ మొత్తం ఈ సినిమా మీదే కేటాయించాడు.
అయినప్పటికీ ఈ సినిమా ఇంకా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకోలేదు. ఇక ఈ సినిమాని శంకర్ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ కొట్టే విధంగా తీర్చిదిద్దుతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. కానీ తను చేసే డిలే వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఉన్న ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక లీకేజ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దానిమీద చాలా రోజుల నుంచి చర్చలు అయితే జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్యారెక్టర్ లో కొద్దిసేపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొదట ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసినప్పటికీ ఒక కీలకమైన సన్నివేశం జరగడంతో ఆయన పాత్ర పాజిటివ్ గా మారి జనాల కోసం పోరాటం చేసే పాత్రగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక రామ్ చరణ్ లాంటి గొప్ప నటుడు ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అని చెప్పవచ్చు. ఇక గ్లోబల్ స్టార్ గా కూడా తను గుర్తింపు సంపాదించుకోవడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి… ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు…