Ram Charan wrote a story: ‘చిరుత’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్…మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగి తన నటనను విస్తరింప చేసుకుంటున్నాడు… తను చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయిన్ టైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే తన మార్కెట్ పూర్తిగా కోల్పోవాల్సిన ప్రమాదం ఏర్పడవచ్చు అన్న ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి ఒక స్ట్రెచర్ ను అయితే ఇచ్చాయి. ఇక ఇప్పుడు దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. గత సంవత్సరం గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది సినిమా విషయంలో క్లారిటీని మెయిన్ టైన్ చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. రామ్ చరణ్ లో ఒక నటుడు, ఒక డాన్సర్ మాత్రమే కాకుండా ఒక కథ రచయిత కూడా ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. అతను ఒక సూపర్ స్టోరీకి సంబంధించిన కథను కూడా రాసుకున్నాడట.
రీసెంట్ గా తనకు సన్నిహితుడైన సుకుమార్ కి ఆ కథను వినిపించారట. సుకుమార్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడట. ఎందుకంటే ఆ కథ చాలా అద్భుతంగా ఉందని అదే కథని తెరమీదకి తీసుకొస్తే కనక సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటు సుకుమార్ చెప్పారట.
మరి అంత డెప్త్ గా రామ్ చరణ్ ఆ క్యారెక్టర్స్ ని కూడా క్రియేట్ చేశారని సుకుమార్ సన్నిహితుల దగ్గర చెప్పారట. మొత్తానికైతే రామ్ చరణ్ లో ఒక మంచి కథ రచయిత కూడా ఉన్నాడు అంటూ అతని అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఫ్యూచర్ లో కథ రచయితగా కూడా రాణిస్తూ తన సత్తా చాటబోతున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…