Raja Saab movie postponed: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారాయి. ఎందుకంటే ఏ భాషలో సినిమా వచ్చినా కూడా ఆ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులు చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రేక్షకులను మెప్పించాలంటే దర్శకులు తీవ్రమైన కసరత్తును చేసి మరి గొప్ప సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది… ఇక బాహుబలి సినిమాతో మొదటి పాన్ ఇండియా హీరోగా అవతరించిన నటుడు ప్రభాస్…ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి రేసు నుంచి తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పెండింగ్ ఉందట… దానివల్లే సినిమాని సంక్రాంతి రేస్ నుంచి తప్పించే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తే ప్రభాస్ అభిమానులు చాలా వరకు నిరాశను వ్యక్తం చేసే అవకాశమైతే ఉంది. రీసెంట్ గా ‘అఖండ 2’ సినిమాని పోస్ట్ పోన్ చేయడంతో బాలయ్య అభిమానులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఇప్పుడు రాజాసాబ్ విషయంలో ప్రభాస్ అభిమానులు సైతం తీవ్రమైన నిరాశ వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2026 సంక్రాంతికి వస్తుందా? లేదా అనే ఉద్దేశ్యంలోనే కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. సినిమా యూనిట్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తే తప్ప ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందా? లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ రాదు… ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ సినిమాను 2026 సంవత్సరం చివరికల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సందీప్ రెడ్డివంగా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. షూట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి సందీప్ ఈ సినిమాను అనుకున్న టైమ్ కి రిలీజ్ చేస్తాడా? లేదా అనేది…అలాగే ఈ మూవీ ప్రభాస్ ఎలాంటి సక్సెస్ ను కట్టబెడుతోందనేది కూడా తెలియాల్సి ఉంది…