Naga Vamsi Wife: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేర్లలో ఒకటి సూర్య దేవర నాగవంశీ(Nagavamsi). ఇండస్ట్రీ లో ఉండే కుర్ర నిర్మాతలలో ఈయన ఒకడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్లాప్స్ లో ఉన్నాడు కానీ, కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధిక సక్సెస్ రేషియో ఉన్న నిర్మాత ఈయన. కేవలం సక్సెస్ రేషియో ఉండడమే కాదు, సార్, లక్కీ భాస్కర్, డీజే టిల్లు, మ్యాడ్ వంటి కల్ట్ క్లాసిక్ విలువలు ఉన్న సినిమాలు కూడా ఈయన ప్రొడక్షన్ నుండి వచ్చాయి. అయితే ప్రతీ సినిమా విడుదలకు ముందు ఈయన చేసే ప్రొమోషన్స్ సదరు సినిమా పై భారీ అంచనాలు పెంచేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రెస్ మీట్ లో, ఇంటర్వ్యూస్ లో ఈయన మాట్లాడే యాటిట్యూడ్ మాటలు పాజిటివ్ గా అయినా, నెగిటివ్ గా అయినా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ గా జనాల్లోకి వెళ్ళినవి సినిమాల పై ప్రభావం కూడా చూపించింది. అందుకు రీసెంట్ ఉదాహరణ ‘వార్ 2’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ వంశీ చాలా ఓవర్ గా మాట్లాడాడు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన పై వచ్చిన ట్రోల్స్ సాధారణమైనవి కాదు. అందుకే ఆయన మొన్న ‘కొత్త లోక’ సక్సెస్ మీట్ లో మైక్ పట్టుకోవడానికి భయపడ్డాడు. ఇదంతా పక్కన పెడితే నిన్న నాగవంశీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా ఫన్నీ టాపిక్ గా మారింది. తన భార్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు..నువ్వు సుఖం గా ఉండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు’ అని అంటాడు. దీనిని చూసిన నెటిజెన్స్ అంటే ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండనివ్వలేదా?, అందరి భర్తలు లాగానే నాగవంశీ కూడా ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాడా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
ఇక ఆయన లేటెస్ట్ సినిమాల విషయానికి వరుస ఫ్లాప్ లో ఉన్న నాగవంశీ కి రీసెంట్ గా విడుదలైన ‘కొత్త లోక’ అనే చిత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టింది. మలయాళం లో ఈ చిత్రం ‘లోక’ అనే పేరుతో విడుదలై 200 కోట్ల రూపాయిల గ్రాస్ కి అతి చేరువగా వెళ్తుంది. ఈ సినిమా తర్వాత నాగవంశీ నుండి ‘మాస్ జాతర’ చిత్రం విడుదల కాబోతుంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని చకచకా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ‘కాంతారా : చాప్టర్ 1’ వాయిదా పడితే ఆ స్థానం లోకి ఈ సినిమా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.