Prithvi and Vishnu Priya : ప్రస్తుతం చాలామంది కామన్ మ్యాన్స్ సైతం బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అవుతున్నారు. ఇక ఇప్పుడు అదే రీతిలో విష్ణు ప్రియ, పృథ్వీలు కూడా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి గురించి ప్రతి ఒక్క ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది అంటే అది కేవలం బిగ్ బాస్ షో ద్వారానే అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
టెలివిజన్ రంగంలో పలు షోస్ కి హోస్ట్ గా వ్యవహరించిన విష్ణు ప్రియ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసిన ప్రతి షో ద్వారా ఆమె తనకంటూ ఒక మార్క్ నైతే ఏర్పాటు చేసుకుంది. ఇక ఆమె ‘బిగ్ బాస్ సీజన్ 8’ లో పాల్గొని మిగిలిన కాంటెస్టెంట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇక 6 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఆమె ఎలిమినేట్ అవ్వడం అనేది ఆమె అభిమానులను తీవ్రమైన మనస్థాపానికి గురి చేసింది. ఇక ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పృథ్వితో ప్రేమాయణం నడిపింది. పృథ్వి కూడా విష్ణు ప్రియ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంతో వీళ్ల మీద పలు రకాల రూమర్లు రావడం హౌస్ మేట్స్ కూడా వీళ్ళును లవ్ బర్డ్స్ గా గుర్తించారు. దాంతో వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని అభిమానులు అందరూ ఆశించారు. మొత్తానికైతే మొదట పృధ్వీ ఎలిమినేట్ అవ్వడం ఆ తర్వాత విష్ణు ప్రియ కూడా ఎలిమినేట్ అవ్వడంతో లవ్ బర్డ్స్ కి బ్రేక్ పడిందనే చెప్పాలి. మరి టైటిల్ విన్నర్స్ గా వీళ్ళు నిలుస్తారని కొంతమంది అనుకున్నప్పటికి మధ్యలోనే వీళ్ళు వెళ్లిపోవడం అనేది వాళ్ల అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేసింది.
ఇక ఇదిలా ఉంటే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడింది…ఇక ఇప్పటికి కూడా వాళ్ళు తరచుగా బయట కలుసుకుంటూ ఉంటారని బిగ్ బస్ సీజన్ 8 ఫైనల్ కి వచ్చిన వీళ్ళిద్దరూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విష్ణు ప్రియ, పృథ్వి ఇద్దరూ కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇంతకుముందు విష్ణు ప్రియ మానస్ తో కలిసి ‘గంగులు ‘ అనే సాంగ్ చేసింది. అయితే ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. దాంతోనే విష్ణు ప్రియ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి తను ఇప్పుడు పృథ్వి తో ఒక రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ విషయం మీద వాళ్ళు ఎలాంటి స్పందనను తెలియజేసినప్పటికి కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఇక బిగ్ బాస్ హౌజ్ లో లవ్ బర్డ్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వీళ్ళు సాంగ్ చేస్తే చూడడానికి వీళ్ళ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు… చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో సాంగ్ ఎప్పుడొస్తుంది అది ఎలా ఉండబోతుంది అనేది…