OG 2: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ‘ఓజీ 2’. మూవీ టీం నుండి కేవలం ఒక ప్రకటన వీడియో వచ్చిందంతే, ఇక సోషల్ మీడియా మొత్తం దాని గురించే టాపిక్ జరిగింది. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు. ఈ ప్రకటన వీడియో లో సుజిత్ పవన్ కళ్యాణ్ కి సన్నివేశాలను వివరిస్తూ ‘స్నో బ్లడ్ అయిపోతుంది.. అప్పుడు ఓజాస్ గంభీర అని అంటారు.. అదే ఇంట్రడక్షన్ షాట్ ‘ అని అంటాడు. ఆ షాట్ కి AI విజువల్స్ ని జోడిస్తూ సోషల్ మీడియా లో మీమర్స్ మరియు అభిమానులు రకరకాల ఎడిటింగ్స్ చేశారు. ఇలాగే వదిలేస్తే త్వరలో సినిమానే AI లో చేసి విడుదల చేసేట్టు ఉన్నారు. ఇదే ప్రకటన వీడియో లో ‘ఇందులో హీరో కి ఒక పెట్ ఉంటుంది అన్నమాట’ అని అనగానే బ్యాక్ గ్రౌండ్ లో డ్రాగన్ ని చూపిస్తారు.
అది చూడగానే నెటిజెన్స్ ఇందులో గంభీర కి డ్రాగన్ పెట్ అంటూ ఎన్నో ఫన్నీ ఎడిటింగ్స్ చేశారు, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు డ్రాగన్ మీద చాలా ఆశలు , అంచనాలే పెట్టుకున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే ఇందులో గంభీర కి పెట్ ఉంటుంది అన్న విషయం వాస్తవమే కానీ , అది డ్రాగన్ కాదని తెలుస్తోంది. ఈ చిత్రం లో డ్రాగన్ కి సంబంధించిన సన్నివేశాలు చాలానే ఉంటాయట కానీ , అది పెట్ మాత్రం కాదట. గంభీర కి పెట్ గా చీటా ఉంటుందని సమాచారం. అప్పట్లో సమురాయ్ క్లాన్ కి చెందిన వాళ్ళు చిరుత పులి ని పెంచుకునేవారట. శత్రు సైన్యాలను ఎదురుకోవడం కోసం అలా చేసేవారట.
‘ఓజీ 2’ చిత్రం మొత్తం ‘ఓజాస్ గంభీర’ తండ్రి ‘జై గంభీర’ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ అని తెలుస్తోంది. అంటే సమురాయ్ కాలం నాటి సన్నివేశాలని ఈ ప్రీక్వెల్ స్టోరీ లో చూపించబోతున్నారు అన్నమాట. అందుకే ఇవన్నీ ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి అభిమానులు డ్రాగన్ గంభీర పెట్ అని భారీ ఆశలు పెట్టుకోకండి , అలా పెట్టుకుంటే నిరాశ చెందుతారు , సినిమా విడుదల తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ 70 శాతం కి పైగా పూర్తి అయ్యిందట. నవంబర్ మొదటి వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని, పవన్ కళ్యాణ్ ఈ సీక్వెల్ కోసం 70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని సమాచారం.
