Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘బ్రో ది అవతార్’ మూవీ వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. డైరెక్ట్ ఓటీటీ లో విడుదలైన ‘వినోదయ్యా చిత్తం’ అనే తమిళ సినిమా స్టోరీ లైన్ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సముద్ర ఖని.
రెండు వెర్షన్స్ కి కూడా ఆయనే డైరెక్టర్ . తెలుగు వెర్షన్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ కూడా విడుదల కానుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ పార్టీ సాంగ్ హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతుల పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆడిపాడనుండి. నిన్న ఈ పాట చిత్రీకరణ మొదలైంది, పవన్ కళ్యాణ్ నేడు షూటింగ్ లొకేషన్ లో పాల్గొన్నాడు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పాటలో పవన్ కళ్యాణ్ మంచి ఎనెర్జిటిక్ స్టెప్పులు వేసాడట.
కేవలం మూడు రోజుల షూటింగ్ ఉన్న ఈ పాట కోసం పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క రోజు కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి ఈ పాటలో ఆడిపాడుతున్నాడట. గోపాల గోపాల సినిమాలో విక్టరీ వెంకటేష్ తో కలిసి పవన్ కళ్యాణ్ వేసిన కొన్ని స్టెప్పులు గుర్తున్నాయి కదా, ఈ పాట కూడా అదే తరహాలో ఉండబోతుందట.చూడాలి మరి ఫ్యాన్స్ కి ఈ పాట ఎలాంటి కిక్ ని ఇవ్వబోతుందా అనేది.