Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు మరియు ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘#OG’. రన్ రాజా రన్ మరియు సాహూ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ చిత్రానికి కూడా దర్సకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి, ఇప్పుడు మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.
మొన్నటి తో మూడవ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తి అయ్యింది. ఇప్పుడు ఆయన రేపటి నుండి ‘వారాహి’ టూర్ తో బిజీ కాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళం నుండి అర్జున్ దాస్ మరియు శ్రీయా రెడ్డి వంటి నటీ నటులు కూడా ఈ సినిమాలో పని చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే #OG కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
అదేమిటి అంటే ఈ సినిమాకి #OG అనే టైటిల్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనట, అసలు టైటిల్ వేరే ఉందని అంటున్నారు. ఈ చిత్రం లోని పవన్ కళ్యాణ్ పాత్ర పేరే టైటిల్ గా ఉండే అవకాశం ఉంది. ‘#they కాల్ హిమ్ OG ‘ అనేది క్యాప్షన్ లాగ ఉండబోతుందట. ఇప్పటికే #OG మోయి టైటిల్ గ్రౌండ్ లెవెల్ లో ఒక రేంజ్ లో రీచ్ అయ్యింది.
ఇదే టైటిల్ ని అన్నీ భాషలకు కామన్ గా ఉంచితే అదిరిపోతోంది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇలా ఈ సినిమా టైటిల్ #OG కాదు, వేరే ఉండబోతుంది అనే వార్త నిజమైతే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. అక్టోబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి , డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా ప్రధాన తారాగణం మీద మూడవ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.