Mahesh Babu son: సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నాలుగైదు కుటుంబాల నుంచి స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ నటులు సైతం ఇండస్ట్రీకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొంతమంది యాక్టింగ్ లో శిక్షణను ఇప్పిస్తుంటే మరి కొంత మంది మాత్రం దర్శకత్వ విభాగంలో కూడా వాళ్లకు కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉంటే బాగుంటుంది. అలాగే వాళ్లకు యాక్టింగ్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే దర్శకుల దగ్గర తమ కొడుకులను జాయిన్ చేస్తున్నారు. ఇప్పటికే రవితేజ లాంటి నటుడు తన కొడుకును సందీప్ రెడ్డి వంగ దగ్గర స్పిరిట్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా జైన్ చేయించాడు. దానివల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మెలకువలు నేర్చుకోవడమే కాకుండా ప్రతి క్రాఫ్ట్ లో దగ్గరుండి మరి వర్క్ నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే రవితేజ ఇలాంటి పని చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు మహేష్ బాబు సైతం తన కొడుకుని సందీప్ రెడ్డి వంగ దగ్గరికి పంపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్ స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేయబోయే సినిమాకి తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వబోతున్నారట.
ఒక్క సినిమాకి తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే అన్ని క్రాఫ్ట్ ల మీద అవగాహన వస్తుందనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు అలాంటి పని చేయిస్తున్నాడట. మొత్తానికైతే గౌతమ్ హీరో గానే ఇండస్ట్రీలో రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దర్శకత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలిసి ఉండడం వల్ల ఆర్టిస్టుగా దర్శకులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనే విషయాన్ని కూడా తను తెలుసుకున్నవాడవుతాడు.
ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అతని దగ్గర వర్క్ నేర్చుకుంటేనే పూర్తిస్థాయి వర్క్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో సినిమా హీరోలు, దర్శకులు సైతం వాళ్ళ పిల్లల్ని తన దగ్గరికి పంపిస్తున్నారు… ఇక గౌతమ్ హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే దాని కోసమే ఘట్టమనేని అభిమానులందరు ఎదురు చూస్తున్నారు…
