Ramesh Ghattamaneni: రమేష్ బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచి మధ్యాహ్నం 12 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు. అయితే, ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా అంత్యక్రియలను త్వరగా ముగించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందుకే శ్రేయోభిలాషులకు ఇతరులు అందరికీ కూడా దహన సంస్కారాల స్థలంలో ఎక్కువగా గుమిగూడకుండా ఉండాలని ఫ్యామిలీ మెంబర్స్ విన్నవించుకుంటూ సందేశం పంపారు.

అయితే, ఇప్పుడు ఓ చర్చ బాగా నడుస్తోంది. తనకు చిన్న తనంలో నటనలో ఓనమాలు నేర్పిన సోదరుడిని కడసారి చూసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తాడా ? రాడా ? అని. మహేష్ ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. అందుకే, ఈ సందేహం అందరిలో నెలకొంది. హోం క్వారంటైన్ లో ఉన్న ఈ వార్త విని మహేష్ చాలా ఏమోసనల్ అయ్యాడని తెలుస్తోంది. మహేష్ కి రమేష్ అంటే చాలా ఇష్టం.
Also Read: Ramesh Babu death: రమేష్ బాబు మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం..!
అందుకే, రమేష్ అంతిమ కార్యక్రమాలకు డైరెక్ట్ గా హాజరు కాకపోయినా వీడియో రూపంలోనైనా అన్నయ్యను చివరిసారిగా చూస్తున్నాడు. ఇక రమేష్ బాబు అంతిమ కార్యక్రమాలకు ఎక్కువమంది హాజరు కాకపోవడమే మంచిదని కృష్ణ ఫ్యామిలీ విజ్ఞప్తి చేసింది కాబట్టి… అభిమానులు కూడా ఎక్కువమంది హాజరు కావడం లేదు. ఘట్టమనేని రమేశ్ బాబు వయసు 56 ఏళ్ళు. ఆయన మరణంతో తెలుగు తెర పై విషాద ఛాయలు అలుముకున్నాయి .
Also Read:Ramesh Ghattamaneni : ఆ నిర్ణయంతోనే రమేష్ బాబు సినీ జీవితం ముగిసింది !