
కరోనా నేపథ్యంలో సినిమాలు షూట్ చేయడం అనేది, రిస్క్ తో కూడుకున్న పనితో పాటు అధిక వ్యయంతో కూడుకున్న పని కూడా. దీనికి తోడు సినిమా నిర్మాణం అనేది నష్టపోవడానికే అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. మరీ ఈ పరిస్థితుల్లో సినిమా నిర్మాత బతకాలంటే ఏమి చేయాలి. నష్టాల నుండి నిర్మాతలు కోలుకోవాలంటే ఏమి చేయాలి అని టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సీక్రెట్ గా చర్చలు జరుపుతోందట. ఈ చర్చలలో ఎలాంటి తీర్మానాలు చేసినా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. స్టార్స్ సపోర్ట్ చేస్తేనే ప్రొడ్యూసర్స్ చర్చలు విజయవంతం అవుతాయి.
Also Read: మరో గొప్ప ప్రయత్నం చేస్తున్న సోనూసూద్
నిజానికి స్టార్ హీరోలు, స్టార్ డైరక్టర్లు తమ రెమ్యూనిరేషన్లను తగ్గించుకోవాలనేది ప్రొడ్యూసర్స్ అభిమతం. ఈ కరోనా నుండి పూర్తిగా పరిశ్రమ కోలుకున్నే దాకా స్టార్ హీరోలు తమ రెమ్యూనిరేషన్ లో 30శాతాన్ని, స్టార్ డైరక్టర్లు తమ రెమ్యూనిరేషన్ లో 35శాతాన్ని తగ్గించుకుంటే నిర్మాతలు నష్టాల పాలు కారని.. ఈ విధంగా స్టార్స్ అందరూ ఒప్పుకునేలా చేయాలని ప్రొడ్యూసర్స్ చర్చలు జరిపారట. మరి ఈ రెమ్యూనిరేషన్ ల తగ్గింపు అనేది సాధ్యమేనా? స్టార్ హీరోల మీద ఆధారపడి నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు.
Also Read: జైలు అప్డేట్ :పాపం రియాకు దిండు కూడా గతిలేదా?
అలాంటి నేపథ్యంలో స్టార్ హీరోలకు రెమ్యూనిరేషన్ ను తగ్గించడం అనేది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉందనుకుంటే అది అత్యాశనే అవుతుంది. అసలు మన స్టార్ హీరోలు ఎప్పుడూ తమ రెమ్యూనిరేషన్ ఇంత అని ఫిక్స్ డ్ గా ఉండరు. డిమాండ్ ను బట్టి, ప్రొడ్యూసర్స్ వారి వెంట పడుతున్న దానిబట్టి, అలాగే నిర్మాత-హీరోల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ను బట్టి రెమ్యూనిరేషన్స్ ఉంటాయి. అయినా నిర్మాణ ఖర్చు తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు స్టార్ హీరోల వెంట పడటం మానేసి మంచి కథలను కొత్త వారిని తీసుకుని బడ్జెట్ ఫిల్మ్స్ చేసుకోవడం ఉత్తమం. ఆ దిశగా నిర్మాతలు ఆలోచిస్తే మంచింది.