Sankranthi 2026 Movies: సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు సంక్రాంతి పండుగను బేస్ చేసుకొని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక 2026 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా 5 సినిమాలు రిలీజ్ అవుతుండడం విశేషం… ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ అలాగే ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన రాజాసాబ్ సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. ఇక వీటితోపాటుగా రవితేజ హీరోగా వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ హీరోగా వస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఐదు సినిమాలు ప్రేక్షకులను అలరించాలనేఉద్దేశ్యంతోనే సంక్రాంతి బరిలో నిలుస్తుండడం విశేషం… రాజా సాబ్, మన శంకర్ వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఈ చిన్న సినిమాలు ఎందుకని వాటికి పోటీగా వస్తున్నాయి అనే కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ప్రేక్షకులందరు ఆ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఆయా సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఆ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కానీ పెద్ద సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది.
కాబట్టి ఈ పోటీలో చిన్న సినిమాలు నలిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఆయా సినిమాల ప్రొడ్యూసర్లు తమ సినిమాల మీద ఉన్న నమ్మకంతోనే సంక్రాంతి బరిలో సినిమాలను నిలుపుతున్నారంటూ కొన్ని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరు తీవ్రమైన పోటీనిస్తుండడం విశేషం…ఇక సంక్రాంతి బరిలో గెలిచేది ఎవరు? ఈ సంక్రాంతి హీరోగా నిలిచేది ఎవరు? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…