Soundarya: సౌందర్య మరణిస్తే ఆ హీరోయిన్ పండుగ చేసుకుందా? అసలు నిజం ఇదీ

Soundarya: సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే హీరోయిన్లకు ఒక్కసారి స్టార్ ఇమేజ్ వస్తే కలకలం ఉంటుంది. అలా తెలుగు అమ్మాయి సావిత్రి ముందుగా దక్షిణాది చిత్రాల్లో నటించి ఆ తరువాత పాన్ ఇండియా లెవల్లోపేరు తెచ్చుకున్నారు. సావిత్రి తరువాత అంతటి సాంప్రదాయమైన హీరోయిన్ ఎవరంటే సౌందర్య నే గుర్తుకు వస్తుంది. హీరోయిన్ అంటే గ్లామర్ చూపించాలని కొందరి భావన. కానీ సాంప్రదాయమైన పద్ధతుల్లో కనిపించినా స్టార్ ఇమేజ్ వస్తుంది.. అని సౌందర్య నిరూపించారు. సినిమాల్లో మంచి పొజిషన్లో […]

Written By: Srinivas, Updated On : April 25, 2023 2:24 pm
Follow us on

Soundarya: సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే హీరోయిన్లకు ఒక్కసారి స్టార్ ఇమేజ్ వస్తే కలకలం ఉంటుంది. అలా తెలుగు అమ్మాయి సావిత్రి ముందుగా దక్షిణాది చిత్రాల్లో నటించి ఆ తరువాత పాన్ ఇండియా లెవల్లోపేరు తెచ్చుకున్నారు. సావిత్రి తరువాత అంతటి సాంప్రదాయమైన హీరోయిన్ ఎవరంటే సౌందర్య నే గుర్తుకు వస్తుంది. హీరోయిన్ అంటే గ్లామర్ చూపించాలని కొందరి భావన. కానీ సాంప్రదాయమైన పద్ధతుల్లో కనిపించినా స్టార్ ఇమేజ్ వస్తుంది.. అని సౌందర్య నిరూపించారు. సినిమాల్లో మంచి పొజిషన్లో ఉండగానే సౌందర్య అకాల మరణం చెందారు. సౌందర్య మరణంపై సామాన్య మహిళలు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలోని ఓ హీరోయిన్ మాత్రం సంబరాలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

బీజేపీ ప్రచారంలో భాగంగా హెలీక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన సౌందర్యను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. ఆమె సినిమాలు వస్తూ చూడని వారుండరు. మరణించిన తరువాత కూడా స్టార్ గా కొనసాగుతున్న హీరోయిన్ సౌందర్య మాత్రమే. అయితే సౌందర్య సినిమాల్లోకి వచ్చాక ఆమెకు వస్తు్న్న పాపులారిటీ చూసి తోటి హీరోయిన్లంతా షాక్ అయ్యారు. ఒక దశలో ఆమెను బీట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి ఆమె ఈ లోకంలో లేదని తెలిసి కొందరు సంతోషపడ్డట్లు వార్తలు వచ్చాయి.

ఆ సమయంలో కొత్తగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్నేహను అచ్చం సౌందర్యలాగే ట్రీట్ చేశారు. స్నేహ సైతం గ్లామర్ షో చేయకుండా సాంప్రదాయంగా నటించారు. అయితే సౌందర్య స్టేజీకి రావాలంటే ఆమె సినిమాల్లో నుంచి తప్పుకుంటే సాధ్యం కాదని కొందరు ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆమె మరణించిన తరువాత స్నేహ సంబరాలు చేసుకుందని ప్రచారం చేశారు. అయితే ఇది నిజమా? కాదా? తెలియక చాలా మంది అయోయానికి గురయ్యారు.

అయితే కొన్నాళ్లకు దీనిపై స్నేహ స్పందించారు. ఈ వార్తలన్నీ అబద్దమని ఆమె కొట్టిపారేశారు. సాటి మనిషి చనిపోతే ఎవరైనా సంబరాలు చేసుకుంటారా? ఇది తెలివి తక్కువ వారు చేసే పని అని ఆమె విమర్శించారు. అయితే స్నేహ ఆ తరువాత కొన్ని సక్సెస్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చారుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పడు సినిమాల్లో కనిపిస్తున్నారు.