Anaganaga Oka Raju Movie: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించింది ఈ చిత్రం. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నవీన్ పోలిశెట్టి కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ, సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని, కానీ నవీన్ పోలిశెట్టి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ , పంచ్ డైలాగ్స్ తో లాగేశాడని, ఓవరాల్ గా మంచి సంక్రాంతి సినిమాని చూసే ఫీలింగ్ నవీన్ పోలిశెట్టి వల్ల మాత్రమే వచ్చిందని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలిసాయి. అదేమిటంటే ఈ చిత్రానికి ముందుగా మ్యాడ్ సిరీస్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కొంతమేరకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి కి యాక్సిడెంట్ అవ్వడం , ఏడాది పాటు రెస్ట్ తీసుకోవడం వల్ల కళ్యాణ్ మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు. అప్పుడు నవీన్ పోలిశెట్టి ‘మారీ’ అనే డైరెక్టర్ ని ఎంచుకొని, ఒక రైటింగ్ టీం ని పెట్టుకొని , తన సొంత ఐడియాస్ తో స్క్రిప్ట్ ని డెవలప్ చేసి ఈ చిత్రం లో నటించాడు. ఇదంతా పక్కన పెడితే, కళ్యాణ్ శంకర్ ఈ స్క్రిప్ట్ ని అనుకున్నప్పుడు ముందుగా విజయ్ దేవరకొండ తో చెయ్యాలని అనుకున్నాడట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఎందుకో ఈ కథ విజయ్ వరకు వెళ్లలేకపోయింది. ఒకవేళ విజయ్ ఈ కథ ఒప్పుకొని చేసుంటే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే ఈ చిత్రం లోని డైలాగ్స్, పంచులు, టైమింగ్ అన్నీ నవీన్ పోలిశెట్టి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసినవి. అవి కేవలం నవీన్ కి మాత్రమే సూట్ అవుతాయి. నవీన్ మార్క్ జనాలకు నచ్చింది కాబట్టే ఆ సినిమా అంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ కి ఈ చిత్రం అంతగా సెట్ అయ్యుండకపోవచ్చు. ఒకవేళ కథలో మార్పులు, చేర్పులు చేసి విజయ్ స్టైల్ లో తీసి ఉంటే హిట్ అవ్వోచ్చేమో కానీ, ఉన్నది ఉన్నట్టుగా తీస్తే మాత్రం పెద్ద దెబ్బ పడేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇకపోతే కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సంపాదించిన ఈ సినిమా ఫుల్ రన్ 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
