https://oktelugu.com/

Manmadhudu Movie: ‘మన్మథుడు’ సినిమాని మిస్ చేసుకున్న కుర్ర హీరో అతనేనా? చేసి ఉంటే రేంజ్ వేరే లెవెల్ లో ఉండేది!

అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ కి ఆస్థాన కవిలాగా ఉండేవాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఎప్పుడైతే త్రివిక్రమ్ విజయ్ భాస్కర్ ని వదిలి సొంతంగా సినిమాలు తియ్యడం ప్రారంభించాడో,

Written By:
  • Vicky
  • , Updated On : June 3, 2023 / 03:01 PM IST

    Manmadhudu Movie

    Follow us on

    Manmadhudu Movie: కొన్ని సినిమాలను మనం ఎప్పటికీ మరచిపోలేము, ఎన్ని సార్లు చూసినా ఆ సినిమాలను మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూనే ఉంటాయి. అలాంటి క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయిన చిత్రం ‘మన్మథుడు’. అక్కినేని నాగార్జున హీరో నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నిలవడమే కాదు, ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం ద్వారా తన విశ్వరూపాన్ని చూపించేసాడు. ఆయన రాసిన ప్రతీ డైలాగ్ అమృతం లాగ ఉంటుంది.

    అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ కి ఆస్థాన కవిలాగా ఉండేవాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఎప్పుడైతే త్రివిక్రమ్ విజయ్ భాస్కర్ ని వదిలి సొంతంగా సినిమాలు తియ్యడం ప్రారంభించాడో, అప్పటి నుండి విజయ్ భాస్కర్ కి బ్యాడ్ టైం ప్రారంభం అయ్యింది. ఇక మన్మధుడు చిత్రం విషయానికి వస్తే ఆరోజుల్లో ఈ సినిమా సుమారుగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. క్లాస్ సినిమా కావడం తో మాస్ సెంటర్స్ లో లాంగ్ రన్ అప్పుడు కాస్త కలెక్షన్స్ తగ్గాయి, అందుకే ఇండస్ట్రీ హిట్ కాలేకపోయింది ఈ చిత్రం.

    ఇప్పటికీ ఈ సినిమాని మనం ఖాళీ సమయం దొరికినప్పుడల్లా యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాము,అంత చక్కటి రిపీట్ వేల్యూ ఉన్న సినిమా ఇది. అయితే ఈ చిత్రాన్ని తొలుత నాగార్జున తో కాకుండా, అప్పటి యంగ్ హీరో తరుణ్ తో చేద్దాం అని అనుకున్నారట. కానీ అదే సమయం లో ఆయన వేరే సినిమాలకు కమిట్ అయిపోయి ఉండడం వల్ల ఈ చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయాడు. వాస్తవానికి ఈ సినిమా తరుణ్ కి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే అప్పట్లో ఆయన ఇలాంటి సినిమాలే చేస్తుండేవాడు. అంతే కాదు మనోడి కామెడీ టైమింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటూనే కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమా మిస్ అయినా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’ లో తరుణ్ ని హీరో గా పెట్టుకొని చేసాడు.

    ఈ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, అలాగే గతం లో ఆయన మన్మథుడు చిత్రాన్ని ఒప్పుకొని చేసి ఉంటే కచ్చితంగా తరుణ్ కెరీర్ కి మంచి బూస్ట్ అయ్యేదని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఎప్పుడైతే నాగార్జున ‘మన్మథుడు’ చిత్రాన్ని ఒప్పుకొని చేసాడో, చిత్రాన్ని ప్రేక్షకులు చూసిన తర్వాత నాగార్జున తప్ప ఈ చిత్రాన్ని ఎవరూ చెయ్యలేరు అనే ఫీలింగ్ కి వచ్చేసారు, ఆ రేంజ్ లో నటించాడు ఆయన.