Jailor 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ‘జైలర్’ చిత్రం ఒక అద్భుతం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఇక ఆయన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో గూబ గుయ్ మనేలా చెప్పుతో కొట్టినట్టు ఈ సినిమా వసూళ్లతో సమాధానం చెప్పాడు రజినీకాంత్. కేవలం సౌత్ ఇండియన్ మార్కెట్ తో ఆయన 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడంటే ఆయన స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే ‘జైలర్ 2 ‘ చిత్రాన్ని మేకర్స్ ఒక వీడియో ద్వారా గ్రాండ్ గా అనౌన్స్మెంట్ చేసారు. ఈ వీడియో కి వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు. ఇతర తమిళ హీరోల టీజర్స్ కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందా అంటే అనుమానమే. అయితే ప్రతీ హీరోకి ఉన్నట్టుగానే రజినీకాంత్ కి కూడా యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఈ వీడియో పై చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
ఈ వీడియో లో ఉన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ కాదని, ఆయన బదులుగా డూప్ ని వాడారు అంటూ నోటికి వచ్చినట్టు కామెంట్ చేసారు. ఇవి బాగా వైరల్ అవ్వడంతో మూవీ టీం దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేసింది. ఈ వీడియోలో స్వయంగా రజినీకాంత్ నటిస్తున్నట్టే ఉంది. ఇప్పటికైనా విమర్శకులు నోర్లు మూయాలని, 74 ఏళ్ళ వయస్సు లో రజినీకాంత్ గారు సినిమా మీద ప్రేమతో ఇంత ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ మేకింగ్ వీడియో ని ఈ స్టోరీ క్రింద మీరు కూడా చూసేయండి. ఈ వయస్సులో ఇంత ఎనర్జీ తో ఉండే సూపర్ స్టార్స్ ఇండియా లో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఈయనతో పాటు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోలందరూ నేడు సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ ఉన్నారు.
కానీ రజినీకాంత్ మాత్రం నేటి తరం సూపర్ స్టార్స్ కి తన సినిమాల ద్వారా భారీ వసూళ్ల టార్గెట్స్ ఇస్తూ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇలాంటి అదృష్టం ఎన్ని జన్మలు ఎత్తినా ఏ హీరోకి దొరకదు. ఈ సినిమా హిట్ అయితే కోలీవుడ్ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల రూపాయిలను అందించిన సినిమా అవుతుంది. ఈ సినిమాతో పాటు ఆయన లోకేష్ కనకరాజ్ తో ‘కూలీ’ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. దీనికి కూడా వెయ్యి కోట్లు కొట్టేంత సత్తా ఉంది. తమిళ సినిమా ఇండస్ట్రీ కి 100 కోట్ల రూపాయిల నుండి 600 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను చూపించింది ఆయనే. ఇప్పుడు వెయ్యి కోట్ల మార్కు ని చూపించబోతున్నది కూడా ఆయనే. అలాంటి సూపర్ స్టార్ ని చూస్తున్న నేటి తరం ఆడియన్స్ మొత్తం అదృష్టవంతులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కూలీ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న రజీనీకాంత్, ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ‘జైలర్ 2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.