Bhartha Mahasayulaku Wignyapthi: సోలోగా ఇండస్ట్రీ కి వచ్చి హీరోగా మారి మాస్ మహారాజు గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు రవితేజ…ఈయన ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించినప్పటికి ఆ సినిమా ఆశించిన రకు విజయాన్ని సాధించలేదు… ఇక ఇప్పుడు కన్ఫ్యూజన్ డ్రామాని క్రియేట్ చేసే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది…
ఒకప్పుడు రవితేజ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారంటీ సినిమాగా ఉండేది ప్రొడ్యూసర్లు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అయిన కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన రొటీన్ సినిమాలు చేస్తుండటం వల్ల ప్రేక్షకులు అతని సినిమాలను చూడడానికి ఇష్టపడడం లేదు.
అందువల్లే ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించే కిషోర్ తిరుమల దర్శకత్వంలో జతకట్టాడు. ఈ సినిమాలో కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించే అంశాలేమీ లేనట్టుగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంటర్ చేసినప్పటికి రవితేజ ఇలాంటి పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
దానికి తోడుగా రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాలు పోటీలో ఉండడం ఈ సినిమాకి భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రవితేజ సక్సెస్ ని సాధిస్తేనే తన కెరీర్ సాఫీగా ముందుకు సాగుతోంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…చూడాలి మరి ఈ సంక్రాంతి విన్నర్ గా రవితేజ నిలుస్తాడా లేదా అనేది…