Chiranjeevi – Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవితో పాటు మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు(Balayya Babu)…ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఈ సినిమా చేసినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం బాలయ్య బాబు సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తు ఉండటం విశేషం… ఇక రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఒకానొక సందర్భంలో చిరంజీవి, బాలయ్య బాబుతో కలిసి నటిస్తానని చాపాడు దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక ఇంద్ర వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్ ని డిజైన్ చేయగలిగితే చేయండి అంటూ బోయపాటికి ఒక హింట్ అయితే ఇచ్చాడు. మరి దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబు చిరంజీవి ఇద్దరు ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు బోయపాటి శ్రీను ఆ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడా అంటూ కొన్ని వార్తలయితే వస్తున్నాయి.
దానికి తగ్గట్టుగానే కొంతమంది రచయితలు సైతం వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాని సెట్ చేయడానికి భారీ కథలను రాస్తున్నారట. చిరంజీవి చెప్పిన తర్వాత వేరే వాళ్ళు ఎందుకు వదులుకుంటారు. అందుకే ఇంద్ర వర్సెస్ సమరసింహారెడ్డి అనే రెండు క్యారెక్టర్లతో సినిమాను డిజైన్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇలాంటి పాత్రలతోనే కథ రాయాలని చిరంజీవి చెప్పాడు. కాబట్టి బోయపాటి కూడా అలాంటి కథలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న బోయపాటి త్వరలోనే వీళ్లిద్దరిని పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…