Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుసగా సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ భారీ హిట్స్ గా నిలిచాయి..అయితే ఈ రెండు సినిమాలకు టికెట్ రేట్స్ అతి తక్కువ ఉండడం వల్ల కలెక్షన్స్ పై గట్టి ప్రభావం పడింది..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ మొత్తం ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన భాగం షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది..పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్న ప్రోమో ని విడుదల చెయ్యగా దానికి ఫాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ సీన్ ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ హల్చల్ చేస్తుంది..ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.
సినిమా ఇంటర్వెల్ పడే సమయం లో పవన్ కళ్యాణ్ ని బహిరంగంగా జనాలు అందరూ చూస్తూ ఉండగా కోటాలో బంధిస్తారు..ఆ తర్వాత ‘ఇక్కడ నిన్ను వదలమని ధైర్యం చేసి చెప్పేవాడు ఒక్కడు ముందుకు వచ్చినా నేను నిన్ను వదిలేస్తాను’ అని చెప్తాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక్కఒక్కరిగా ముందుకు వస్తూ వేల సంఖ్య లో చేరి ‘వీరమల్లు ని వదలాలి’ అంటూ నినాదాలు చేస్తారు.
వింటుంటేనే రోమాలు నిక్కపొడిచేలా ఉంది కదూ!..ఇక వెండితెర సరైన టేకింగ్ తో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తే అభిమానులకు మరియు ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం..డైరెక్టర్ క్రిష్ తనకి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రతి సన్నివేశం మీద ఎంతో హోమ్ వర్క్ చేస్తూ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపొయ్యే రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..చూడాలిమరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో అనేది.