Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు గారు (Akkineni Nageswara Rao) ‘గోపాలకృష్ణుడు’ (Gopala Krishna) అనే సినిమా చేస్తున్న రోజులు అవి, ఆ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయడంతో ఆ సినిమా పై అందరి ఆసక్తి పెరిగింది. పైగా అక్కినేనిది గోపాలకృష్ణుడి పాత్ర. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు కొంటె పాత్రలకు పెట్టింది పేరు. ఆయన అభిమానులు అక్కినేని మళ్ళీ అలాంటి పాత్రలు చేయాలని ఆశ పడుతున్న రోజులు అవి. అందుకే, ‘గోపాలకృష్ణుడు’ సినిమాలో రోమియా పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో అక్కినేని వెంటనే అంగీకరించారు.
పైగా చాలా రోజుల తర్వాత అమ్మాయిల వెంటపడుతూ, డ్యూయెట్లు పాడుకునే పాత్ర అక్కినేనిది. అందుకే ఆయన ఆ పాత్రలో లీనం అయిపోయారు. ఎంతైనా హుషారైన పాత్ర కావడం, స్టెప్స్ కూడా మంచి కిక్ ఇచ్చేలా వేశారు. ఇక నాగేశ్వరరావుగారు పక్కన జయసుధను తీసుకున్నారు. ఆమె కూడా అక్కినేనికి పోటీ పడి మరీ నటించింది.
మొత్తానికి అక్కినేని – కోదండరామిరెడ్డి కలయిక పై క్రేజ్ పెరిగింది. అందుకే, గోపాలకృష్ణుడు సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే.. ఈ కలయికలో తానూ మరో సినిమా చేయబోతున్నట్లు బుచ్చిరెడ్డి గ్రాండ్ గా అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ విషయం దర్శకుడు కోదండరామిరెడ్డికి తెలియదు.
ఆ సినిమాకి సంబంధించి పేపర్లో న్యూస్ వచ్చింది. పేపర్లో చూసి తెల్లబోయాడు కోదండరామిరెడ్డి. నిర్మాత బుచ్చిరెడ్డికి ఫోన్ చేసి ‘ఏమిటి నిర్మాతగారు ఇది.. నాతో చెప్పకుండా ఇలా ఎందుకు ప్రకటించారు ? అని అడిగాడు. ‘అక్కినేనిగారు నీ అభిమాన హీరో కదా. మరోసారి ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే చేయవా ఏమిటి ? అంటూ నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేశారు.
కట్ చేస్తే. ‘గోపాలకష్ణుడు’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ సినిమా పెద్ద ప్లాప్. అదే సమయంలో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరో సినిమా కూడా ప్లాప్ అయింది. దాంతో బుచ్చిరెడ్డి మనసు మార్చుకున్నారు. కోదండరామిరెడ్డి – అక్కినేని కాంబినేషన్ లో సినిమా మళ్ళీ డైరెక్టర్ కి చెప్పకుండానే కట్ చేసేశాడు.