Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 14వ తేదీన రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ అనే పాటకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ పాటనే కనిపిస్తుంది. లక్షల సంఖ్యలో నెటిజెన్స్ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు. రమణ గోగుల చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా మరోసారి తన గాత్రాన్ని మన తెలుగు ఆడియన్స్ కి అందించారు. ఆయన రీ ఎంట్రీ అదిరిపోయింది. నేడు ఈ సినిమాలోని రెండవ పాట ‘మీనా’ కాసేపట్లో విడుదల కాబోతుంది. ఈ పాట కి సంబంధించిన ప్రోమో ని చూస్తుంటే భీమ్స్ మరో అద్భుతమైన చార్ట్ బస్టర్ ట్యూన్ ని అందించినట్టుగా అనిపించింది.
సినిమా ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తుంటే చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ సోలో బ్లాక్ బస్టర్ హిట్ పడేలా కనిపిస్తుంది. ఈ సంక్రాంతి రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తో పాటు, బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రం విడుదల అవుతున్నాయి. రామ్ చరణ్ పెద్ద స్టార్ కాబట్టి ఆడియన్స్ కి మొదటి ఛాయస్ ‘గేమ్ చేంజర్’ చిత్రం మాత్రమే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం రెండవ ఛాయస్ గా వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఉంటుంది. ఈ రెండు చిత్రాలకు నిర్మాత దిల్ రాజే అవ్వడం మరో విశేషం. రెండు సినిమాల కంటెంట్స్ పై ఆయనకీ విపరీతమైన నమ్మకం ఉండడం వల్లే, మూడు రోజుల గ్యాప్ లో తన రెండు సినిమాలను విడుదల చేస్తున్నాడు. కాలం కలిసి వస్తే ఆయనకీ ఈ సంక్రాంతి కి లాభాలే లాభాలు. ఎందుకంటే ఈమధ్య కాలంలో దిల్ రాజు చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి.
ఆయన మళ్ళీ కోలుకోవాలంటే ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలి. వెంకటేష్ కి ఈ చిత్రం మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల షేర్ సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం క్లైమాక్స్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యాన్స్, ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక యంగ్ హీరో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఆ యంగ్ హీరో చుట్టూనే కామెడీ సన్నివేశాలు తిరుగుతాయని అంటున్నారు. ఇంతకీ ఎవరు ఆ యంగ్ హీరో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వరుస హిట్స్ దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కి ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ ఇవ్వబోతుందో చూడాలి.