Niharika Konidela
Niharika Konidela: మెగా డాటర్స్ లో నిహారిక కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే బుల్లితెరలో షోలు చేస్తూ అలానే సినిమాల్లో కూడా నటించిన ఏకైక మెగా డాటర్ నిహారిక. ఒక మనసు, సూర్యకాంతం లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకునింది నిహారిక.
కాగా సినిమాలతోనే కాకుండా కొన్ని పర్సనల్ విషయాల వల్ల కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా నిహారిక ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్యనే చైతన్యతో విడాకులు తీసుకున్న నిహారిక ఆ విషయం నుంచి కొంచెం త్వరగా నే బయటపడి తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని పోస్టులు షేర్ చేస్తూ అభిమానులను అల్లరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిహారిక ఒక అబ్బాయికి బర్త్ డే విషెస్ చెప్పడం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
అసలు విషయానికి వస్తే కాస్కో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి నిఖిల్ విజయేంద్ర. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు అలానే బిగ్ బాస్ ఇంటర్వ్యూల ద్వారా కూడా బాగా ఫేమస్ అయిన నిఖిల్ కి అలానే నిహారిక కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీరిద్దరూ ఈ మధ్యనే కలిసి అలీతో సరదాగా షోకు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిహారిక వేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
నిహారిక నిఖిల్‌కు తనదైన స్టైల్ లో బర్త్ డే విషెస్ చెప్పింది. హోస్ట్ నుంచి.. కో యాక్టర్‌గా మారావ్.. అక్కడి నుంచి ప్రొడ్యూసర్.. అటు నుంచి నా చిట్టి తమ్ముడిగా మారావ్.. మనం ఎంతో ప్రయాణించాల్సి ఉంది.. ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్లు కొంత మందే ఉన్నారు.. అందులో నువ్వు ఒకడివి.. లవ్యూ నిక్కి.. నీకు అంతా బాగా జరగాలి.. హ్యాపీ బర్త్ డే నానా అంటూ నిహారిక పోస్ట్ వేసింది.
ఇక నిఖిల్ పై ఎంతో అభిమానంతో నా చిట్టి తమ్ముడు ఐ లవ్ యు అంటూ నిహారిక వేసిన పోస్ట్ కింద తెగ కామెంట్లు పెడుతున్నార నెటిజెన్స్.