Homeఎంటర్టైన్మెంట్Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజమౌళి సినిమా గురించి ఇంటరెస్టింగ్ వార్త...

Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి సినిమా గురించి ఇంటరెస్టింగ్ వార్త…

Mahesh babu: తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోల్లో మహేశ్ బాబు ఒకరు. తనదైన శైలిలో నటనలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. తెలుగు స్టేట్లే కాకుండా ఇతర భాషల్లో అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకే సొంతం. ఎప్పుడూ మూస పాత్రలు కాకుండా వెరైటీ పాత్రలు పోషిస్తూ తనలోని నటనకు ప్రాణం పోస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అందాల నటుడిగా ప్రశంసలు పొందుతున్నారు.

interesting news circulating in social media about mahesh babu and rajamouli movie

ఇక మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.  యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా కనిపించనుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేష్ ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేశ్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి కలయికలో సినిమా రావాలని ప్రేక్షకులు కూడా ఆతృతగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని భారీ స్థాయిలో  పాన్ ఇండియన్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది.

అయితే ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ నటుడు కీలక పాత్రలో నటించవచ్చని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజముందో కానీ ప్రస్తుతానికి ఈ టాక్ అయితే బయటకి వచ్చింది. ఈ సినిమాపై ఆల్రెడీ చాలా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లోనే ఉన్న ఈ చిత్రం మొదలవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం రాజమౌళి కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా  ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular