https://oktelugu.com/

Mahesh Babu: ఇండియా లో ఏ హీరోకి దక్కని ఘనత సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు…

Mahesh Babu: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాల నటుడుగా కెరీర్‌ మొదలు పెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఓవైపు అమ్మాయిల కలల రాకుమారుడిగా మరోవైపు మాస్‌ ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు మహేష్‌. తన అద్భుత నటన, అందంతో ప్రేక్షకులను అలరిస్తోన్న మహేష్‌ క్రేజ్‌ సోషల్‌ మీడియాలో కూడా విపరీతంగా ఉంటుంది. ట్విట్టర్‌లో మహేష్‌ బాబును ఏకంగా 12 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 2, 2022 / 02:30 PM IST
    Follow us on

    Mahesh Babu: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాల నటుడుగా కెరీర్‌ మొదలు పెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఓవైపు అమ్మాయిల కలల రాకుమారుడిగా మరోవైపు మాస్‌ ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు మహేష్‌. తన అద్భుత నటన, అందంతో ప్రేక్షకులను అలరిస్తోన్న మహేష్‌ క్రేజ్‌ సోషల్‌ మీడియాలో కూడా విపరీతంగా ఉంటుంది. ట్విట్టర్‌లో మహేష్‌ బాబును ఏకంగా 12 మిలియన్‌ మంది ఫాలో అవుతుండడం విశేషం. భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న అతికొద్ది మంది హీరోల్లో మహేష్‌బాబు ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.

    ఇక ట్విట్టర్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న మహేష్‌ తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా చేసే ఒక్కో ట్వీట్‌కు ఎక్కువ లైక్స్‌ పొందిన వ్యక్తిగా మహేష్‌ బాబు రికార్డును సొంతం చేసుకున్నారు. లక్ష లైక్‌లకు పైగా లైక్స్‌ ఉన్న 30 ట్విట్‌లతో మహేష్‌ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే ఎంజాయ్‌ చేస్తున్న మహేష్‌ కొత్త ఏడాది వేడుకలు అక్కడే జరుపుకున్నారు.

    ఇక మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ కూడా పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 1 వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.