Homeఎంటర్టైన్మెంట్Prabhas: త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ పై క్లారిటీ ఇవ్వనున్న "ప్రాజెక్ట్ K" చిత్ర యూనిట్...

Prabhas: త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ పై క్లారిటీ ఇవ్వనున్న “ప్రాజెక్ట్ K” చిత్ర యూనిట్…

Prabhas: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు అన్ని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. అందులో భాగంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “ప్రాజెక్ట్ K” ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి పలు వార్తలు వస్తున్నాయి.

interesting news about pan india star prabhas project k movie

సైన్స్​ ఫిక్షన్​ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా” ప్రాజెక్ట్​ K” ఈ చిత్రానికి ముందుగా మిక్కీ జె మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఓ కోలీవుడ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ‘కబాలి’, ‘కాలా’, ‘జిగర్తాండ’ సహా పలు సినిమాలకు సంగీతం అందించిన సంతోష్​ నారాయణ్​ను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ సినిమా నుంచి మిక్కీని తప్పించి సంతోష్​ను తీసుకున్నారా లేదా వీరిద్దరూ కలిసి ఈ సినిమా కోసం పనిచేయనున్నారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో త్వరలో దీని గురించి క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభించారు. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న అమితాబ్​ బచ్చన్​ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు చిత్ర బృందం. ​త్వరలోనే ప్రభాస్ కూడా సెట్స్​లోకి వెళ్లనున్నారు అని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 14న “రాధే శ్యామ్” చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే విడుదలైన పాటలు పోస్టర్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular