Viraj Ashwin: రీసెంట్ సమయం లో బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14 వ తారీఖున గ్రాండ్ గా విడుదలై, మంచి టాక్ ని దక్కించుకొని ఓపెనింగ్స్ దగ్గర నుండి కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
కేవలం నాలుగు రోజుల్లోనే 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, బయ్యర్స్ కి అప్పుడే డబుల్ ప్రాఫిట్స్ ని రాబట్టింది. ఇలా అతి తక్కువ సమయం లో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన అరుదైన సినిమాల్లో ఒకటిగా బేబీ చిత్రం నిల్చింది. ఇందులో నటించిన ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ కి తమ్ముడు అనే విషయం అందరికీ తెలుసు, అలాగే హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది అనే విషయం అందరికీ తెలుసు.
కానీ ఈ చిత్రం సెకండ్ హీరో గా నటించిన విరాజ్ అశ్విన్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇతను అంతకు ముందు ‘అనగనగ ఒక ప్రేమకథ’ అనే చిత్రం ద్వారా హీరోగా/ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత పాపులర్ టీవీ యాంకర్ అనసూయ తో కలిసి ‘థాంక్యూ బ్రదర్’ అనే చిత్రం లో హీరోగా నటించడం వల్ల , విరాజ్ అనే వ్యక్తి ఇండస్ట్రీ లో ఉన్నాడనే సంగతి ఆడియన్స్ కి తెలిసింది. ఆ చిత్రం తర్వాత ఆయన ‘మనసానమః’ అనే షార్ట్ ఫిలిం చేసాడు.
ఈ షార్ట్ ఫిలిం కి అంతర్జాతీయ స్థాయి లో 513 అవార్డ్స్ ని దక్కించుకుంది. సినీ చరిత్రలోనే అనితర సాధమైన రికార్డు కావడం తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది ఈ సంఘటన. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక రీసెంట్ గా ‘బేబీ’ చిత్రానికి ముందు ఆయన హీరో గా నటించిన ‘మాయ పేటిక’ అనే చిత్రం అలా విడుదలై వారం రోజులు తిరగకుండానే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ‘బేబీ’ చిత్రం తో గ్రాండ్ హిట్ కొట్టాడు కాబట్టి రాబొయ్యే రోజుల్లో ఈయనకి మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. చూడాలి మరి.