Fauji Movie Story: ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలలో రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఎంచుకుంటున్న జానర్ సినిమాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. నేను ముట్టుకోని జానర్ అంటూ ఏది మిగలలేదు అనే విధంగా ఆయన కెరీర్ సాగుతోంది. ఆయన చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఫౌజీ'(Fauji Movie). హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు, కానీ సినిమాలో మాత్రం కచ్చితంగా గొప్ప కంటెంట్ ఉంది అని ఈ పోస్టర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. యుద్ధం బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ గా హను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
రీసెంట్ గా హను రాఘవపూడి ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు వింటే, ఎంత గొప్ప ఆలోచన, ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనిది అని అనిపించక తప్పదు. ఆయన మాట్లాడుతూ ‘నా దృష్టిలో కర్ణుడు,అర్జునుడు, ఏకలవ్యుడు ముగ్గురు సరిసమానమైన వీరులు. లెజండరీ వారియర్స్. హీరోయిజం లో ఈ ముగ్గురు వీరులు డిఫరెంట్. నైపుణ్యం, త్యాగం, భక్తి వంటి అంశాల్లో వీళ్లకు తిరుగేలేదు. మహాభారతం లో కర్ణుడు పాండవుల పక్షాన ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నాలో ఉండేది. ఆ ఆలోచనల నుండి పుట్టిందే ‘ఫౌజీ’ లోని ప్రభాస్ క్యారక్టర్. ఇది మైథలాజికల్ మూవీ కచ్చితంగా కాదు, కానీ హీరో పాత్ర కర్ణుడి లక్షణాలకు అద్దం లాగా ఉంటుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో , వలస రాజ్యాల పాలనలో , యుద్ధ వాతావరణం లో ఈ సినిమా నేపథ్యం ఉంటుంది. బ్రిటీష్ కాలం లో జరిగిన స్వాతంత్ర పోరాటానికి బలమైన ఎమోషన్స్, పొలిటికల్ టెన్షన్స్ ని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు హను రాఘవపూడి.
స్టోరీ టెల్లింగ్ విషయంలో హను రాఘవపూడి స్టైల్ వేరు. చాలా పొయిటిక్ గా ఉంటుంది. ఆయన స్టైల్ లో ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ని డీల్ చేయడం చాలా ప్రమాదకరం. బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇలాంటి డైరెక్టర్స్ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా టేకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అందులో హను రాఘవపూడి సక్సెస్ అయితే, సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది. లేదంటే కష్టమని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఎలా డీల్ చేయబోతున్నాడు అనేది.