https://oktelugu.com/

Superstar Krishna Second Marriage: కృష్ణ గారు రెండవ పెళ్లి చేసుకోవడానికి ఆయన మొదటి భార్య ఇందిరా గారిని ఒప్పించినా వ్యక్తి ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు.

Superstar Krishna Second Marriage: టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి స్థానం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని ఒక్క రేంజ్ కి తీసుకెళ్లిన మహానుభావుడు ఆయన..హీరో గా , నిర్మాతగా మరియు డైరెక్టర్ గా కృష్ణ గారు చేసినన్ని ప్రయోగాలు ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా చెయ్యలేదు..టాలీవుడ్ లో మొట్టమొదటి కౌ బాయ్ చిత్రం చేసింది ఆయనే..మొట్టమొదటి కలర్ సినిమాని తీసింది ఆయనే మొట్టమొదటి 70 MM సినిమాని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 06:15 PM IST
    Follow us on

    Superstar Krishna Second Marriage: టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి స్థానం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని ఒక్క రేంజ్ కి తీసుకెళ్లిన మహానుభావుడు ఆయన..హీరో గా , నిర్మాతగా మరియు డైరెక్టర్ గా కృష్ణ గారు చేసినన్ని ప్రయోగాలు ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా చెయ్యలేదు..టాలీవుడ్ లో మొట్టమొదటి కౌ బాయ్ చిత్రం చేసింది ఆయనే..మొట్టమొదటి కలర్ సినిమాని తీసింది ఆయనే మొట్టమొదటి 70 MM సినిమాని తీసింది కూడా ఆయనే..అంతే కాకుండా ముక్కుసూటి తనం మరియు మంచితనం కృష్ణ గారికి ఆభరణాలు లాంటివి..ఆయన అతి మంచితనం ని ఉపయోగించుకొని ఆయన్ని దారుణంగా మోసం చేసే వారు కొంతమంది..ఇది కాసేపు పక్కన పెడితే 1969 వ సంవత్సరం లో ఆయన విజయ నిర్మల గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్ళు పెళ్లి చేసుకుంటున్న సమయానికి కృష్ణ గారికి అప్పటికే పెళ్లి అయిపోయి రమేష్ బాబు ,మహేష్ బాబు మరియు మంజుల పుట్టి ఉన్నారు..అలాగే విజయ నిర్మల గారికి కూడా కృష్ణ గారితో పెళ్లి కి ముందే మొదటి భర్త కి పుట్టిన నరేష్ సంతానం గా ఉన్నారు.

    Superstar Krishna, vijayanirmala

    అయితే కృష్ణ గారు విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు..ముఖ్యంగా కృష్ణ గారి అమ్మ అయితే విజయ నిర్మల గారిని చాలా తీవ్రంగా వ్యతిరేకించేది..ఎముకంటె ఇందిరా గారు స్వయానా కృష్ణ గారి అమ్మగారికి మేనకోడలు అవుతుంది..తన మేనకోడలికి ఇంత అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేని అని..ఈ పెళ్ళికి నేను ససేమీరా ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పిందట..ఆ సమయం లో కృష్ణ గారి సోదరుడు ఆది శేషు గారు చొరవ తీసుకొని కృష్ణ గారి తల్లిని మరియు కృష్ణ గారి మొదటి భార్య ఇందిరా గారిని ఒప్పించి ఈ పెళ్లి చేశారట.

    Also Read: Jabardasth Show- Movie Promote: జబర్దస్త్ షో లో ఒక సినిమాకి ప్రమోషన్ చెయ్యాలంటే ఎంత డబ్బులు చెల్లించాలో తెలుసా?

    Superstar Krishna

    కృష్ణ గారి గగోగులు అన్ని కూడా మొదటి నుండి విజయ నిర్మల గారే దగ్గరుండి చూసుకునేవారట..ఆమె చివరి క్షణం వరుకు కృష్ణ గారి చేతులు వదలలేదు..కొన్నేళ్ల క్రితమే ఆమె గుండెపోటు తో మరణించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆమె మరణించిన సమయం లో కృష్ణ గారు ఎంత బాధకి గురయ్యారో మన అందరం చూసాము..ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చిన చెక్కు చెదరని ఆత్మా విశ్వాసం తో ఉండే కృష్ణ గారిని అలా ఏడవడం చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు.

    Also Read:Rashmika Mandanna- Venu Swamy: రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక

    Tags