Subhalagnam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా జగపతిబాబు హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఒకప్పుడు చాలా మంచి సినిమాలు వచ్చాయి. అందులో ఫ్యామిలీ సినిమాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే జగపతిబాబు,ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.ఇక అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే అది శుభలగ్నం సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఎమోషన్ కూడా ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ని అనుభవిస్తున్న ఒక భార్య భర్త ఇద్దరు కలిసి బతుకుతున్న ఫ్యామిలీలో భార్య కి డబ్బు పిచ్చి ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు.
ధన ఆశ వల్ల ఆమె భర్తను ఎలా కోల్పోవాల్సి వచ్చింది అనేది కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.అయితే ఈ సినిమాకి ఆ స్టోరీ ని అంత బాగా ఎవరు సెట్ చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం…ఇక ఈ సినిమా స్టోరీ రాసుకుంటున్నా క్రమంలో ఈ సినిమాకి రైటర్ గా పనిచేసిన దివాకర్ బాబు, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఇద్దరు కూడా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ అంత పూర్తయింది కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎలా నడిపించాలి అనేది వాళ్లకు అర్థం కాలెందంట దాని వల్ల ఏదో ఒక కథ అయితే రాశారు కానీ సెకండ్ హాఫ్ అంతా స్ట్రాంగ్ గా లేదు అని అనుకున్నప్పుడు రెండో హీరోయిన్ గా రోజా వచ్చి ఇతన్ని పెళ్లి చేసుకుంటుంది ఇక ఇక్కడి తో ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇలా వెళ్తే ఆల్మోస్ట్ సినిమా కూడా అయిపోయినట్టే ఇక కాన్ ఫ్లిక్ట్ ఎక్కడుంది అని వాళ్ళు ఇద్దరు తలలు పట్టుకున్నారు.
ఆ సమయంలో సెకండ్ హాఫ్ ఎలా నడిపిద్దాం అనే విషయం వాళ్లకు స్ట్రైక్ అవ్వనప్పుడు దాంట్లోకి కన్ఫిట్ కావాలని దివాకర్ బాబు చెప్పి డబ్బు ఆశ ఉన్న ఆవిడ భర్తని అమ్ముకుంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ ని దివాకర్ బాబు చెప్పడంతో అది డైరెక్టర్ కి బాగా నచ్చింది.ఇక ఇప్పటి వరకు రాసుకున్న స్టోరీ మొత్తాన్ని మార్చేసి సెకండ్ హాఫ్ లో చాలా మార్పులు చేస్తూ దాన్ని ఒక ఎమోషనల్ డ్రామాగా మలిచారు… అప్పటివరకు డబ్బు ఆశ ఉన్న తన భార్యను మార్చడానికి హీరో ఇంకో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సృష్టించి దానికి సంబంధించిన సీన్లను వేసి ఆమెను మార్చుదాం అనే ఉద్దేశంలో హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో నడిచే కథ డబ్బు పిచ్చి ఉన్న భార్యా పాయింట్ ఆఫ్ వ్యూ లోకి మారిపోయి ఆమె సైడ్ నుంచి నడిపించడం స్టార్ట్ చేశారు.
ఇక ఈ స్టోరీ లో కూడా చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. అలాగే స్క్రీన్ ప్లే లో కూడా డైరెక్టర్ ఒక అద్భుతమైన మ్యాజిక్ చేస్తూ చివరికి ఆ భర్త ఎవరికి చెందుతాడు అనే ఒక ఇంట్రెస్ట్ ని చివరి వరకు మెయింటైన్ చేస్తూ అద్బుతం గా నడిపించాడు.ఇక ఈ సినిమాలో డబ్బు కోసం మొగుణ్ణి అమ్ముకున్న క్యారెక్టర్ లో ఆమని బాగా నటించింది. అలా డబ్బు కోసం మొగుడిని అమ్ముకొగా వచ్చిన డబ్బు తో హాయిగా జీవించవచ్చు అనే క్యారెక్టర్ తో డైరెక్టర్ మనకు ఏం చెప్పారు అంటే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు మన అనుకున్న వాళ్ళు మనతో ఉన్నప్పుడే లైఫ్ హాయి గా ఉంటుంది అప్పుడే మనం సంతోషం గా ఉంటాం అంటూ ఈ సినిమా ద్వారా ఆయన ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు…