Razakar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటే మాత్రం ఆ సినిమాను ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూస్తూ ఆదరిస్తూ ఉంటారు. ఇక మనవాళ్ళకి ఒక సినిమా నచ్చింది అంటే భాషతో సంబంధం లేకుండా, ఆ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేస్తూ ఆ సినిమా విజయంలో ప్రేక్షకులు కూడా కీలకపాత్ర వహిస్తూ ఉంటారు.అలా ఇప్పటివరకు పర భాష నుంచి వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే మన తెలంగాణ గడ్డ మీద రజాకార్ల అణిచివేత ఎలా ఉండేది అనే అంశాన్ని తీసుకొని చేసిన ‘రజాకర్ ‘ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా జనం అందరిలో ఒక నూతన ఉత్సాహాన్ని కూడా నింపుతుందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో చూపించిన సంఘటనలు నిజంగా జరిగాయా లేదంటే కల్పితంగా చూపించారా అని చాలామంది చాలా రకాల ప్రశ్నలను సంధిస్తున్నారు.
నిజానికి నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటిలో కొన్నింటిని సినిమాల్లో చూపించారు. ఊచకోత అంటే ఏంటో అప్పటి తెలంగాణ ప్రజలకు తెలిసినంత గొప్పగా మరేవరికి తెలియదు. నిజాం పాలనలో చాలా దుర్భేద్యమైన జీవితాన్ని అనుభవించిన తెలంగాణ ప్రజలు పోరాటాన్ని చేయడమే కాకుండా నిజాం కి వ్యతిరేకంగా చాలామంది చాలా ఉద్యమాలు కూడా చేశారు. అయినప్పటికీ వాళ్ల ఆగడాలు ఆగలేదు. ఆడవాళ్ళని బట్టలు తీసి బతుకమ్మ ఆడించిన చాలా ఘోరమైన పరిస్థితులను భరించి, ఆ రజాకార్ల అంతం నుంచి ఒక నూతన తెలంగాణ పుట్టింది.
అందుకే తెలంగాణ ఎదురుకున్నన్ని ఎదురు దెబ్బలు మరే ప్రాంతం ఎదుర్కొని ఉండదు. ఈ విషయాన్ని చాలామంది కవులు, కళాకారులు చాలాసార్లు చెప్పారు. అయితే రజాకార్ల చరిత్ర గురించి ఎక్కడా కూడా ఎక్కువగా చదివింది లేదు. ఆ చరిత్రను కనుమరుగు చేశారు. కానీ అప్పుడున్న కవులు, కళాకారులు వాళ్ళు పాడిన పాటల ద్వారా గాని, వాళ్ళ నాటకాల ద్వారా గాని రజాకార్లు పెట్టిన ఇబ్బందులను ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి పాటల రూపంలో లో నాటకాల రూపం లో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నారు. అందువల్లే ఇప్పుడున్న జనరేషన్ కి కూడా అప్పటి విషయాలు చాలా తెలుస్తున్నాయి… మొత్తానికైతే రజాకర్ సినిమా చేయడం అనేది ఒక గొప్ప ప్రయత్నం అనే చెప్పాలి..