Pooja Ramachandran: సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉండి తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటీనటులు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటూ ఒక ఒక ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చూపిస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నటి ‘పూజా రామచంద్రన్’ (Pooja Ramachandran) కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక పూజ బెంగళూరులో పుట్టింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో కోయంబత్తూర్ లో తన చదువు మొత్తాన్ని ముగించింది.
అలాగే విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీని సంపాదించింది. ఇక ఆ తర్వాత మిస్ కోయంబత్తూర్ గా నిలిచిన ఆమెకి మోడలింగ్ మీద ఆసక్తి పెరగడంతో మోడల్ గా మారింది. ఇక అప్పటి నుంచి పలు చిత్రాల్లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ‘సెవంత్ సెన్స్’ (7th Sense) సినిమాలో ఆమె మొదటి అవకాశాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత స్వామి రారా, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో ఆమె మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా నటిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా ఆమె నటించిన నటనకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అయితే లభించింది…ఇక 2010 నుంచి 2017 వ సంవత్సరం వరకు ఆమె వీడియో జాకీగా పని చేసింది. ఇక అప్పుడే వీడియో జాకీగా పని చేస్తున్న క్రైగ్ ని పెళ్లి చేసుకుంది. 2017లో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు… 2019 వ సంవత్సరంలో జాన్ కొక్కన్ (John Kokkan) అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక బాబ్ కూడా ఉన్నాడు.
ఇక ప్రస్తుతం ఆమె ‘హత్య’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా జనవరి 24వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక పూజ సినిమాలే కాకుండా ‘ది విలేజ్’ అనే వెబ్ సీరీస్ కూడా చేసింది… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి తను చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం…