Pawan Kalyan Love Story: సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ అంటే ఒక క్రేజ్. ఆయన సినిమాలంటే ఫ్యాన్స్ కు సందడే సందడి. దశాబ్దాలుగా ఫ్యాన్ష్ లో ఊపు తెస్తున్న పవన్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. మధ్యలో కొన్నేళ్లపాటు రాజకీయాల్లోకి వెళ్లినా.. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో కొనసాగినా.. మరోవైపు సినిమాల్లో మాత్రం బిజీగా ఉంటున్నాడు. ఈ తరుణంలో పవన్ కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా పవర్ స్టార్ కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటంటే?
‘అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి’ అనే ఫస్ట్ మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తరువాత హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటించారు. తొలిప్రేమ సినిమాతో ఆయన కెరీర్ టర్న్ అయిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి పవన్ కు ఫ్యాన్ష్ ఫాలోయింగ్ పెరగడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ అభిమానులు ఆయన సినిమా వచ్చిందంటే పండుగ చేసుకుంటూ ఉంటారు.
పవన్ మెగాస్టార్ చిరంజీవి అండతో సినిమాల్లోకి వచ్చినా.. సొంత ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాల్లో సక్సెస్ జీవితాన్ని కొనసాగిస్తూనే.. రాజకీయాల్లో కొనసాగుతూ ప్రత్యేకంగా నిలిచాడు. అయితే పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ లో రేణు దేశాయ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న పవన్ ఆమెతో విడాకులు తీసుకున్నారు. అటు రేణు దేశాయ్ తో కూడా మనస్పర్థలు వచ్చి ఆమెకు దూరంగా ఉంటున్నారు.
కానీ పవన్ మాత్రం కాలేజీ లైఫ్ లోనే ఓ అమ్మాయిని ప్రేమించినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాను కళాశాలలో చదువుకున్నప్పుడు ఓ అందమైన అమ్మాయి ఉండేదట. ఆమెను అందరూ ఇష్టపడ్డారట. కానీ ఆమె మాత్రం పవన్ వైపు ఎక్కువగా చూసేదట. దీంతో పవన్ స్నేహితులు ఆమె తనను ప్రేమిస్తుందని చెప్పారట. వెంటనే ప్రపోుజ్ చేయాలి ఫోర్స్ చేశారట. దీంతో పవన్ తన వద్ద ఉన్న పాత కారును రిపేరు చేసుకొని మరీ ఆమెకు ఎక్కించుకుని కొంత దూరం వెళ్లి ప్రపోజ్ చేసినట్లు సమాచారం. అయితే ఆమె పవన్ ను ఎడాపెడా తిట్టి .. నీ వయసెంటి? నీ మాటలేంటి? అని చెప్పి వెళ్లిపోయిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చస్తున్నారు.