Malli Serial: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లకు ఇప్పుడు ఛాన్స్ లేకపోవడంతో వెండితెర నుంచి బుల్లితెర వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రంం కన్నడ, తమిళ్, మలయాళం హీరోయిన్ లు కూడా మన తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నారు. వారికి తెలుగు రాకున్నా కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పించి మరీ వారిని నటించేలా చేస్తున్నారు సీరియల్స్ నిర్మాతలు. మరి మన తెలుగు వారికి అవకాశాలు రావు అనుకుంటున్నారా? కానీ ఇందరి మధ్యలో మన తెలుగు నటి కూడా ఉంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా?
మల్లి సీరియల్ హీరోయిన్ భావన లాస్యనే ఆ హీరోయిన్. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్స్ తో దూసుకొనిపోతుంది. ఊరిలో చదువుకోవాలి అని కలలు కన్న ఒక అమ్మాయి, అనుకోకుండా సిటీకి రావడం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే అంశం చుట్టూ నడుస్తుంటుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ టైటిల్ పాత్రలో నటిస్తుంది భావన. బెంగాల్ లో పుట్టినా వైజాగ్ లో పెరిగింది. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగి. కెనడాలో ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేయాలి అనే కల ఉంటుంది. కానీ అనుకోకుండా సీరియల్ లో అవకాశం వచ్చింది.
సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసే ఫోటోలను చూసిన స్టార్ మా ఈమెను సంప్రదించింది. తర్వాత వాళ్లు కాల్ కూడా చేశారట. ఇదంత నిజం కాదు అనుకున్నారట భావన. కానీ ఒకసారి ఫోన్ చేసి సీరియల్ లో చేస్తావా? అని అడిగారట. ప్రతిసారి పరీక్షలు ఉన్నాయి అని ఏదో ఒక కారణం చెప్పి భావన తప్పించుకునేవారట. కానీ ఒకసారి వెళ్లి చూద్దాం అనుకొని ఈశ్వర్ ని కలిశారట. అప్పుడు ఈ సీరియల్ అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న సీరియల్ అని తెలిసి సంతోషించారట.
అన్నపూర్ణ స్డూడియోస్ పేరుతో ఆఫర్ నిజమే అని నమ్మి.. నటించడానికి అంగీకరించిందట. ఈ విషయాన్ని వాళ్ల ఇంట్లో చెప్తే భావన తల్లి ప్రోత్సహించారు. అయితే ఈమెకు యాక్టింగ్ రాదని భయపడిందట. కానీ ఒకసారి చేస్తేనే కదా తెలుస్తుంది అని తల్లి ధైర్యం చెప్పడంతో.. సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. 21 సంవత్సరాలు మాత్రమే ఉన్న భావన మంచి గుర్తింపు సంపాదించింది.