Keerthi Bhat: కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేసిన ఈ బ్యూటీ గత బిగ్ బాస్ సీజన్ ద్వారా ఫుల్ ఫేమ్ ను సంపాదించింది. బిగ్ బాస్ లో అవకాశాన్ని అందుకున్న ఈ బ్యూటీ టాప్ 5 కంటెస్టెంట్ లలో కొనసాగింది. ఈ షో తర్వాత ఆమె బుల్లితెర సీరియల్స్ లో మరింత బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ నటి మధురానగరి అనే సీరియల్ లో నటిస్తుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న కీర్తి తన గురించి కొన్ని విషయాలను వెల్లడించింది.
కీర్తి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈమె నటుడు విజయ్ కార్తీక్ తో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న కీర్తి తన లవ్ బ్రేకప్ గురించి కొన్ని విషయాలను పంచుకుంది. తాను గత ఐదు సంవత్సరాల క్రితం ఒకతన్ని ప్రేమించానని.. కానీ ఆయన నా ప్రేమను రిజక్ట్ చేశారంటూ ఎమోషనల్ అయింది. ప్రేమించి చివరకు మా ఇంట్లో ఒప్పుకోరంటూ మోసం చేశాడని.. ఆ సమయంలో నరకం అనుభవించానంటూ తెలిపింది కీర్తి.
పూర్తిగా లాక్ డౌన్ ఉండడంతో ఒక్కదాన్నే ఇంట్లో ఉండి నాకు ఏమి దిక్కు తెలియదని ఏవేవో ఆలోచనలు వచ్చేవని తెలిపింది. అంతే కాదు ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది కీర్తి. చివరకు తనకు తాను ధైర్యం చెప్పుకొని ఆ సందర్భం నుంచి బయటపడిందట. తన వారందరిని కోల్పోయిన తర్వాత ఓ పాపను దత్తత తీసుకున్నానంటూ బాధ పడింది కీర్తి. ఇక ఈమెను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది వచ్చారట. కానీ పాప ఉన్న విషయం తెలిసి వెనకడుకు వేశారట. అయితే ఈమె దత్తత తీసుకున్న పాప అనారోగ్య సమస్యల వల్ల మరణించిన విషయం తెలిసిందే.
ఈమె విషయంలో సాడ్, హ్యాపీ మూమెంట్స్ అంటే రెండని.. పాపను దత్తత తీసుకోవడం సంతోషకరమైన విషయం అయితే.. తల్లిదండ్రిని కోల్పోవడం బాధాకరం అంటూ తెలిపింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి తాను ఒక్కతే బతికిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో సందర్బాల్లో ఫ్యామిలీని తలుచుకొని ఎమోషనల్ అయింది కీర్తి. చివరకు ఈమె ఓ ఇంటి కోడలు అవుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కార్తీక్ ను పెళ్లి చేసుకోనుంది. తనకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా కార్తీక్ ముందుకు వచ్చి ఆమెకు జీవితం ఇవ్వడం సంతోషకరమైన విషయం..