Rekha: ఒకప్పుడు అందాల తార అయిన రేఖ బాలీవుడ్ జనాలందరిని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఆమె అందాన్ని చూడ్డానికి ప్రతి ప్రేక్షకులు కూడా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తూ ఉండేవారు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆమె 67 సంవత్సరాల వయసులో ఉంది ఇక ఇప్పుడు ‘రేఖ ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట యాసర్ ఉస్మాన్ ఆమెకు సంబంధించిన బయోగ్రఫీని రాశారు. ఇక ఆమె చాలామందితో ఎఫైర్ నడిపిన విషయాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆమె కొంతమంది సెలబ్రిటీలతో ప్రేమ పెళ్లి వ్యవహారాలను కూడా నడిపారు అది కూడా అందులో పొందుపరిచారు. ఇక నుదుటిన సింధూరాన్ని ధరించే రేఖ ఇప్పటికీ ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయాలు మాత్రం ఎవరికి తెలియదు. అయినప్పటికీ తన నుదుటిన మాత్రం సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటుంది… ఇక ఎంటైర్ కెరియర్ లో ఎంతమందితో లవ్ ఎఫైర్ నడిపిందో ఆ బుక్ లో పొందుపర్చారు. ఇక వాళ్లేవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
జితేంద్ర
తను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో జితేంద్ర తో ఎక్కువ సినిమాలు చేసింది. దానివల్ల ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడడంతో వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటు అప్పట్లో వార్తలు అయితే భారీ గా వచ్చాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ఈమె కూడా అతనితో బాగా సన్నిహితంగా ఉండేది అంటూ అప్పటి మీడియా చాలా కథనాలను రాసింది…
కిరణ్ కుమార్
కిరణ్ కుమార్ తో కూడా రేఖ చాలా సంవత్సరాల పాటు లవ్ ఎఫైర్ నడిపిందని వార్తలు అయితే వినిపించాయి. ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య కొన్ని సినిమాలు రావడంతో ఆ సినిమా టైం లోనే వీళ్ళిద్దరి ప్రేమలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ మధ్య బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు…
అమితాబచ్చన్
అమిత బచ్చన్ స్టార్ హీరోగా బాలీవుడ్ లో చాలా సంవత్సరాల పాటు వెలుగుందారు. ఇక ఇలాంటి క్రమంలో రేఖతో ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో వీళ్లిద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది ఇక దాంతో వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించడమే కాకుండా స్క్రీన్ మీద వీళ్ళ కెమిస్ట్రీకి ప్రేక్షకులందరూ మంత్ర ముగ్ధులయ్యేవారు.ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండేదని ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్ గా ఎఫైర్ నడిచేది అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక అమితాబ్ జయ ను పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ల మధ్య వచ్చే రూమర్లకు చెక్ పెట్టడానికి జయ బచ్చన్ రేఖతో అమితాబచ్చన్ ఎక్కువ సినిమాలు చేయకుండా చేసింది.
వినోద్ మేహ్రా
రేఖ సీరియస్ గా ఎక్కువ రోజుల పాటు ప్రేమ వ్యవహారాన్ని నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వినోద్ మేహ్రా అనే చెప్పాలి. ఈయన తో రేఖా కి మంచి సన్నిహిత్యం ఉండేది అయితే అది కొద్ది రోజుల తర్వాత విడిపోవాల్సి వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు పుష్కలంగా వినిపించినప్పటికీ రేఖ మాత్రం వాటి మీద ఎప్పుడు స్పందించలేదు…
సంజయ్ దత్
లేడీస్ మాన్ గా పేరుపొందిన సంజయ్ దత్ రేఖతో మంచి రిలేషన్ షిప్ ని మెయింటెన్ చేశాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారనే కథనాలు చాలా వచ్చినప్పటికి సంజయ్ దత్ వాటిని ఖండించాడు…
ముఖేష్ అగర్వాల్
ఇక రేఖ ఎట్టకేలకు ముఖేష్ అగర్వాల్ అనే ఒక బిజినెస్ మాన్ పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని గొడవల వలన ఇద్దరు తొందరలోనే సపరేట్ అయ్యారు. ముఖేష్ అగర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సూసైడ్ చేసుకోని చనిపోయారు.
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ తో కూడా రేఖ ఎఫైర్ నడిపింది. వీళ్లిద్దరి మధ్య కొన్ని సినిమాలు తెరకెక్కడంతో అప్పుడే వీళ్లిద్దరి మధ్య ప్రేమ అనేది చిగురించడంతో ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో కూడా బ్రేకప్ అయ్యింది…
ఇక తన కెరియర్ లో చాలా మంది తో ఎఫైర్ నడపడమే కాకుండా చాలా సార్లు వార్తల్లో నిలిచింది…