Akhanda : అవకాశం ఆ చిన్నారిని వెతుక్కుంటూ వచ్చింది. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది ఆ బుజ్జాయి. అంతే..తొలి సినిమాతోనే ఎనలేని కీర్తిని గడించింది ఆ పాప. ఆమె ఎవరు అంటే.. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రంలో బాలయ్యకు కూతురుగా నటించిన పాప.. ఆ పాపకు సినిమాలో అవకాశం ఎలా వచ్చిందంటే..

‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రంలో నటించిన చిన్నారి గురించి మాట్లాడారు. చిత్రం విడుదలయ్యాక ప్రతీ ఒక్కరు ఆ బుజ్జాయి గురించి మాట్లాడుతారని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ బుడ్డదాని గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు, నందమూరి, సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. బాలయ్య కూతురుగా నటించిన ఆ చిన్నారి ఎవరూ అని గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వెతుకుతున్నారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌కు ఫస్ట్ సినిమానే పెద్ద హీరో బాలయ్యతో రావడం ఆమె అదృష్టమని అనుకుంటున్నారు. ఇక బాలయ్య సినిమాకు ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది.
గతంతో డైరెక్టర్ బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్స్ కాగా, ఈ మూవీ అంతకు మించిన సినిమా అవుతున్నది. రెండో వారాంలోనూ పిక్చర్ దూసుకుపోతున్నది. థియేటర్స్ వద్ద హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. ఈ ఫిల్మ్‌కు విదేశాల్లోనూ మంచి ఆదరణ కనబడుతోంది. జనరల్‌గా బాలయ్య సినిమాలకు ఫారిన్ కంట్రీస్‌లో కొంత తక్కువే చూస్తారు. కానీ, ఈ సినిమా మాత్రం అలా కాదు.. విదేశాల్లోనూ ఊపుతోంది.
Also Read: Pushpa Movie: “పుష్ప” మూవీ తేడా కొడితే చావుకు సిద్దం అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్…
సినిమా కథను మలుపు తిప్పిన ఆ చిన్నారి పేరు బేబీ దేష్ణ. పిక్చర్ ఇంటర్వల్‌కు ముందర ‘అఖండ’ పాత్ర రావడానికి ఈ చిన్నారి పాత్ర కారణం అవుతుంది.బేబీ దేష్ణ సినిమాలో తన పాత్రను చక్కగా పోషించిందని ప్రేక్షకులు అంటున్నారు. బేబీ దేష్ణకు సినిమా ఆఫర్ ఎలా వచ్చిందంటే.. సోషల్ మీడియాలో అనగా ఇన్ స్టా గ్రామ్‌లో బేబీ దేష్ణ ఫొటోలు చూసి దర్శక నిర్మాతలు తమను సంప్రదించారని బేబీ దేష్ణ తల్లిదండ్రులు తెలిపారు. ఇక సినిమా సెట్‌లో బాలయ్య కూడా బేబీ దేష్ణను బాగా మెచ్చుకున్నారు. ఆమెను చక్కగా ఆడిపించడంతో పాటు ఆమెతో అల్లరి కూడా చేశారట బాలయ్య. ఈ చిన్నారికి ఇంకా కొన్ని సినిమాల్లో అవకాశాలొచ్చాయని బేబీ దేష్ణ పేరెంట్స్ చెప్తున్నారు.
Also Read: మళ్లీ బిజీ కాబోతున్న హాస్య దిగ్గజం !