Vadde Naveen- NTR: వడ్డే నవీన్ అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరోగా సినిమాలు చేశారు. నిర్మాత వడ్డే రమేష్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మొదట్లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రానురాను ఆయన ఫ్యామిలీ హీరోగా మారిపోయారు. పెళ్లి సినిమాతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వసూల్ల వరద పారించింది.

దీంతో వడ్డే నవీన్ కు వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే ఆయన ఓ పెద్దింటికి అల్లుడు అయ్యాడు. ఆ పెద్ద ఇల్లు ఎవరిదో కాదండోయ్.. టాలీవుడ్ ను శాసిస్తున్న నందమూరి కుటుంబానికి వడ్డే నవీన్ అల్లుడయ్యాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అప్పటికే స్టార్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు, వడ్డే నవీన్ కు మంచి స్నేహ భావం ఉండేది. కాగా సీనియర్ ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన రామకృష్ణ కూతురు చాముండేశ్వరి, వడ్డే నవీన్ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే అప్పటికే వడ్డే నవీన్ తండ్రి రమేష్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ వీరి సంబంధాన్ని జూనియర్ ఎన్టీఆర్ కుదిర్చారని కొన్ని వార్తలు వచ్చాయి. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దీంతో వడ్డేనవీన్ ఎన్టీఆర్ కు బావ అయ్యాడు. ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ కొన్ని రోజుల తర్వాత విడిపోయారు.

ఆ తర్వాత వడ్డే నవీన్ కు సినిమాల పరంగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. నవీన్ ప్రవర్తన కారణంగానే విడిపోయారు అంటూ అప్పట్లో నందమూరి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం వడ్డే సినిమా అవకాశాలపై పడింది. దీంతో రానురాను అతనికి ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపు 28 సినిమాల్లో హీరోగా చేసిన నవీన్.. చివరకు ఆఫర్లు లేక ఒకటి రెండు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశాడు. కానీ ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పెద్దగా రాణించలేకపోయారు. ఇక మరో అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. రీసెంట్ గా తమ కొడుకు పంచె కట్టు ఫంక్షన్ నిర్వహించగా టాలీవుడ్ లోని పెద్దలు అందరూ హాజరయ్యారు.
Also Read:IPL 2022: ఐపీఎల్ కు ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్.. భారీగా పడిపోతున్న టీఆర్పీ..!