Rajinikanth Basha movie: ఒక్క సినిమా చాలు ఒక నటుడిని స్టార్ హీరో చేయడానికి. రజినీకాంత్ జీవితంలో కూడా అలాంటి సినిమా ఒకటుంది. అదే బాషా మూవీ. ఈ మూవీతో రజినీకాంత్ ఏకంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. అప్పటి వరకు ఉన్న అన్ని సినిమా రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇందులో రజినీకాంత్ నటవిశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే.

1995 జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన బాషా బాక్సాఫీస్ కింగ్ గా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ అయి ఈ ఏడాదితో 27 ఏళ్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా వెనకాల జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
తమిళంలో సెన్సేషనల్ హిట్ కొట్టిన బాషా మూవీ కథను డైరెక్టర్ సురేష్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి వినిపించడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. దీంతో అల్లు అరవిద్ వెళ్లి ఈ మూవీ తమిళ ప్రొడ్యూసర్ తో చర్చలు జరిపారు. కానీ ఆయన తెలుగు రైట్స్ కోసం రూ.40లక్షలు అడిగారు. అంత ఇవ్వలేమని చివరగా రూ.25 లక్షలు ఇస్తామని చెప్పారు అరవింద్. కానీ ఒప్పుకోకపోవడంతో ఈ మూవీ రీమేక్ ఆగిపోయింది.
బాషా మూవీ దాదాపు ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్ తో జరుగుతుంది. ఇందులోని కీలక సన్నివేశాలు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, హోటల్ తాజ్ ఏరియాలో చిత్రీకరించారు.

ఈ మూవీలోని డైలాగ్స్ ఇప్పటికీ చాలా ఫేమస్. ముఖ్యంగా మంచివాడు మొదట కష్టపడొచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు.. కానీ ఓడిపోతాడు లాంటి డైలాగ్ అయితే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. దాంతో పాటు ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అనే డైలాగ్‌ను ఎవరి సందర్భానికి బట్టి వారు ఇప్పటికీ వాడేసుకుంటారు.
బాషా మూవీ తర్వాత రజినీకాంత్‌కు తెలుగులో అమాంతం మార్కెట్ పెరిగింది. అప్పటి వరకు ఉన్న మార్కెట్ చాలా తక్కువ.
దాదాపు సంవత్సరం పాటు థియేటర్లలో ఆడిన బాషా మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్లు వసూలు చేసి సంచలన రికార్డు నమోదు చేసింది.
బాషా సినిమాలోని నేను ఆటో వాడిని అనే సాంగ్ షూటింగ్ లో 100 మంది డ్యాన్సర్లను ఉపయోగించారు. ఈ సాంగ్ షూటింగ్ మొత్తం చెన్నైలోని విజయ వాహిని స్టూడియోలో చిత్రీకరించారు.

ఇక ఈ మూవీలోని మరో సాంగ్ అయిన స్టైల్ స్టైలురా ను జేమ్స్ బాండ్ థీమ్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారు.
ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ ను ఏవీఎం ఆడియో దాదాపు రూ.25 లక్షలకు కొన్నది. అప్పట్లోనే అది పెద్ద రికార్డు. ఇప్పుడు అయితే కొన్ని కోట్లలో వుంటుంది.
ఈ మూవీలోని హీరో, విలన్ల పేర్లు అయిన మానిక్, ఆంటోనీ చాలా ఫేమస్. ఈ పేర్లతో చాలా సినిమాలు కూడా వచ్చాయి.
ఇక డిజిటల్ టెక్నాలజీ పరంగా కొన్ని మార్పులు చేసి 2017 మార్చి 3న మరోసారి ఈ మూవీని విడుదల చేశారు.
Also Read:IPL 2022: ఐపీఎల్ కు ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్.. భారీగా పడిపోతున్న టీఆర్పీ..!
[…] Also Read:Rajinikanth Basha movie: రజినీకాంత్ లైఫ్ ను మార్చేసి… […]