Jabardasth Comedian Komaram Kumar: బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోస్ లో జబర్దస్త్(Jabardasth) ఒక ట్రెండ్ సెట్టర్. 12 ఏళ్ళ క్రితం మొదలైన ఈ బిగ్గెస్ట్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయమై నేడు అత్యున్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఈ షోని ఇప్పటికీ వీక్షిస్తూనే ఉన్నారు. ఈ షో ని అనుసరిస్తూ, పక్క చానెల్స్ లో కూడా ఇదే తరహా కామెడీ షోస్ ని ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. ఎన్ని షోస్ వచ్చినా జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ మూడేళ్ళ క్రితం వరకు అద్భుతంగా ఉండేది. ఎప్పుడైతే ఈ షో నుండి నాగబాబు వెళ్లిపోయాడో, అప్పటి నుండే ఈ షో పతనం నెమ్మదిగా మొదలైంది. అదే విధంగా ఈ షోలో టాప్ మోస్ట్ కమెడియన్స్ గా కొనసాగిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర,ఇమ్మానుయేల్ వంటి వారు సినిమాల్లో అవకాశాలు రావడం తో ఈ షోని వదిలి వెళ్లిపోయారు.
దీంతో టీఆర్ఫీ రేటింగ్స్ మరింత పడిపోవడం మొదలైంది. ప్రస్తుతం ఉన్నటువంటి కమెడియన్స్ కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఉన్నవారిలో ఆటో రాంప్రసాద్ స్కిట్స్ కాస్త వర్కౌట్ అవుతున్నాయి. కానీ ఆయనకు గతం లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను టీం లో ఉండేవారు. ఈ ముగ్గురు కలిసి చేసే హంగామా వేరే లెవెల్ లో ఉండేది. ఇప్పుడు వాళ్లిద్దరూ వెళ్లిపోవడం మునుపటి వైభవం రామ్ ప్రసాద్ స్కిట్స్ లో కనిపించడం లేదు. అయితే జబర్దస్త్ షో ప్రస్తుత పరిస్థితి పై జబర్దస్త్ కమెడియన్ కొమరక్కా, అలియాస్ కొమరం కుమార్ చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. జబర్దస్త్ షో ఇప్పుడు ఇంత పడిపోవడానికి ఆయన చెప్పిన కారణాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు జనాలకు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం టీవీ ఒక్కటే ఛాయస్ గా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అన్ని చానెల్స్ లోనూ జబర్దస్త్ ని మించిన షోస్ వచ్చేసాయి. ఇక ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిల్లో రీల్స్ చేస్తూ జబర్దస్త్ ని మించిన కామెడీ చేస్తున్నారు. జబర్దస్త్ ని మించిన కామెడీ ని చిరంజీవి స్థాయి వ్యక్తుల నుండి సామాన్యుల వరకు సోషల్ మీడియా లో పొందుతున్నారు. ఒకప్పటి తో పోలిస్తే ఆడియన్స్ బాగా డివైడ్ అయిపోయారు. ఈ షో ఇంతలా పడిపోవడానికి కారణం నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి వాళ్ళు వెళ్లిపోవడం ఒక కారణం అయితే, ఆ రేంజ్ లో కామెడీ ని ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ పండించలేకపోవడం మరో కారణం. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ షో ని ఎవ్వరూ పైకి లేపలేరు, చివరికి చిరంజీవి జడ్జి గా వచ్చినా కూడా అసాధ్యమే’ అంటూ చెప్పుకొచ్చాడు.