Bigg Boss 9 Telugu Bharani Remuneration: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో వరుసగా షాకింగ్ ఎలిమినేషన్స్ ని చూస్తున్నాము. గత వారం అన్యాయంగా శ్రీజ ని వైల్డ్ కార్డు ఓట్ల ద్వారా బయటకు పంపేశారు. ఈ వారం కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని అనుకున్న భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భరణి ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్ తీసుకోలేకపోతున్నారు. ఆయన అంటే ఎంతో అభిమానించే తనూజ,దివ్య వంటి వారు అయితే ఏడుపు ఆపుకోలేకపోయారు. ఆడియన్స్ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కేవలం భరణి కోసం బిగ్ బాస్ షో ని చూసే ఆడియన్స్ సంఖ్య చాలా పెద్దదే. కానీ ఎందుకో వాళ్ళు ఓట్లు వేయడం లో ఎక్కడో జాప్యం చేయడం వల్లనో, లేదా భరణి కచ్చితంగా సేవ్ అవుతాడు, దివ్య ని కాపాడుకోవాలని ఆమెకు వెయ్యడం వల్లనో ఏమో తెలియదు కానీ, ఆయన మాత్రం ఎలిమినేట్ అయిపోయాడు.
ఈ ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ కానుంది. ఇమ్మానుయేల్ వద్ద పవర్ అస్త్ర ఉంది కదా,దానిని ఉపయోగించి భరణి సేవ్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు భరణి ఎలిమినేట్ అయ్యాడు వంటి ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం దొరకనుంది. ఇదంతా పక్కన పెడితే, భరణి బిగ్ బాస్ హౌస్ లోకి రాక ముందు నుండే టాప్ సినీ నటుడు. ఎన్నో సీరియల్స్ లో విలన్ గా, హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. ఆడియన్స్ కి ఎన్నో ఏళ్ళ నుండి సుపరిచితమైన వ్యక్తి. అందుకే ఈయనకు భారీగా రెమ్యూనరేషన్ ని ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఒప్పుకుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఆయన వారానికి మూడు లక్షల రూపాయిలు అందుకున్నాడట. అంటే ఆరు వారాలకు కలిపి 18 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం. చివరి వారం వరకు ఉంటే ప్రైజ్ మనీ కంటే ఎక్కువ డబ్బులు ఆదుకునేవాడు.
మరికొంతమంది చెప్తున్నది ఏమిటంటే, భరణి బిగ్ బాస్ హిస్టరీ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ అని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన యాంకర్ రవి అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా ఇన్ని రోజులు కొనసాగాడు. ఆయనకు దాదాపుగా నాలుగున్నర లక్షల రూపాయిల వరకు వారానికి రెమ్యూనరేషన్ ని ఇచ్చారట. అత్యధిక వారాలు హౌస్ లో కొనసాగాడు కూడా. భరణి కి వారానికి 5 లక్షలు ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ఆయన మాత్రం బిగ్ బాస్ హిస్టరీ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరని బలంగా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో తర్వాత భరణి కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.