Singer Chinmayi Sripada: చిన్మయి శ్రీపాద సింగర్ గా కంటే ఫెమినిస్ట్ గానే చాలా ఫేమస్. ఆమె చాలా కాలంగా మహిళల లైంగిక వేధింపులు, హక్కులపై పోరాడుతున్నారు. ఆమె మీటూ ఉద్యమానికి కూడా మద్దతు తెలిపారు. అలాగే కోలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె సీరియస్ అలిగేషన్స్ చేయడం జరిగింది. న్యాయపోరాటానికి కూడా దిగారు. వైరముత్తు తనతో పాటు పరిశ్రమల్లో చాలా మంది మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు, లైంగికంగా వేధించాడనేది చిన్మయి ప్రధాన ఆరోపణ. వైరముత్తుపై ఆరోపణల తర్వాత ఆమె కెరీర్ కూడా దెబ్బతింది.

ఇక మహిళలకు మద్దతుగా అనేక సామాజిక కార్యక్రమాలు ఆమె నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.తరచుగా మగవాళ్ల ఆధిపత్యాన్ని , వేధింపులను ప్రశ్నిస్తూ పోస్ట్స్ పెడుతూ ఉంటారు. కాగా ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా పోస్ట్స్ ఉన్నాయనే కారణంగా ఇంస్టాగ్రామ్ యాజమాన్యం ఆమె అకౌంట్ ని తాత్కాలింగా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని చిన్మయి శ్రీపాద స్వయంగా వెల్లడించారు. కారణాలు వివరిస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు.
కొందరు మగాళ్లు తమ పురుషాంగాల ఫోటోలు నాకు సందేశాలు రూపంలో పంపిస్తున్నారు. వారందరిపై నేను రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన కారణంగా నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ చేశారు. ఇది నా బ్యాకప్ ఇంస్టాగ్రామ్ అకౌంట్…. అంటూ ఆమె ట్వీట్ చేశారు. కరుడుగట్టిన ఫెమినిస్ట్ గా చిన్మయిని ద్వేషించే మగాళ్లు చాలా మంది వున్నారు. వాళ్ళు తరచుగా ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి కొందరు ఆమెకు అసభ్యకర ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారట. వాళ్ల అకౌంట్స్ ని రిపోర్ట్ చేసినందుకు నా అకౌంట్ సస్పెండ్ చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ నటుడు, దర్శకుడు. అందాల రాక్షసి చిత్రంలో రాహుల్ హీరోగా నటించారు. దర్శకుడిగా చిలసౌ, మన్మధుడు 2 చిత్రాలు తెరకెక్కించారు. మన్మధుడు 2 అట్టర్ ప్లాప్ కావడంతో పాటు విమర్శల పాలైంది. ఆ చిత్రంలో శృంగార సన్నివేశాలను ఉద్దేశిస్తూ… చిన్మయిని సైతం జనాలు ట్రోల్ చేశారు. ఇక ఇటీవలే చిన్మయి తల్లి అయ్యారు. జూన్ 22న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చిన్మయి కవలలకు జన్మనిచ్చారు.
Instagram has basically removed MY account for reporting men who send ME their penises on DMs.
Its been going on for a while where I report but MY access was barred.
Anyway that’s that.
My backup account is chinmayi.sripada 🤦🏽♀️— Chinmayi Sripaada (@Chinmayi) June 23, 2022
Recommended Videos
[…] […]
[…] […]