https://oktelugu.com/

Jr NTR: ఆ హీరో స్ఫూర్తితోనే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష..!

NTR Hanuman Deeksha: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ వెయ్యి కోట్ల మార్క్ ను అతి తక్కువ సమయంలో చేరుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఎన్టీఆర్, రాంచరణ్ లు ఓవర్ నైట్లో ప్యాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. ‘ఆర్ఆర్ఆర్ ’ తర్వాత రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 01:56 PM IST
    Follow us on

    NTR Hanuman Deeksha: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ వెయ్యి కోట్ల మార్క్ ను అతి తక్కువ సమయంలో చేరుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఎన్టీఆర్, రాంచరణ్ లు ఓవర్ నైట్లో ప్యాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు.

    ‘ఆర్ఆర్ఆర్ ’ తర్వాత రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు. ఈ మూవీలో చరణ్ కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా పట్టాలెక్కుతుండగానే రాంచరణ్ నటించిన ‘ఆచార్య’ విడుదలకు రెడీగా ఉంది. ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజు కానుంది.

    ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్ కు ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చిన కొరటాల శివతోనే ఆయన తదుపరి ప్రాజెక్టు ఉండనుంది. దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులను సైతం ఎన్టీఆర్ లైన్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాజాగా హనుమాన్ దీక్షలో కన్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

    Also Read: TRS Politics : బీజేపీతో ఫైట్.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు పనిచేస్తుందా?

    గతంలో ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా హనుమాన్ దీక్షలో కన్పించలేదు. రాంచరణ్ మాత్రం ప్రతీయేటా అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో హనుమాన్ దీక్షను ఎక్కువగా వేసేది మాత్రం మెగాస్టార్ చిరంజీవే. ఆయన స్ఫూర్తితోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం హనుమాన్ దీక్షను పాటిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

    ఎన్టీఆర్ హనుమాన్ దీక్షలో ఉన్నారనే వార్త అభిమానులకు తెలియడంతో ఇందుకు సంబంధించిన పిక్స్ కావాలని ఫ్యాన్స్ ఆయన్ని కోరారు. దీంతో వారి కోరికను మన్నించి ఎన్టీఆర్ వారికి ఫోటోలను పంపించారు. ఈ ఫోటోలను అభిమానులు హనుమన్ జయంతి రోజున సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరలయ్యాయి.

    Also Read: MS Dhoni: ధోని.. ది బెస్ట్ ఫినిషర్.. ఐపీఎల్ హిస్టరీలోనే 20వ ఓవర్లో అత్యధిక పరుగులు

    హనుమాన్ దీక్షలో భాగంగా ఎన్టీఆర్ 21రోజుల పాటు మాలధరణలో ఉండనున్నారు. ఈ దీక్షలో భాగంగా ఎన్టీఆర్ ఆంజనేయస్వామి బొట్టు రంగులో ఉండే దుస్తులు, పాదాలకు చెప్పులు లేకుండా ఉన్న ఫోటోలు బయటికి వచ్చారు. ఈ 21 రోజులు ఎన్టీఆర్ ఎంత నిష్టతో ఈ దీక్ష చేయనున్నాడు. కొరటాల శివతో సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు.

    Recommended Videos: