Prabhas Radhe Shyam Movie: ప్రభాస్ సినిమాకి వినూత్న విచిత్ర ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా ?

Prabhas Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. మార్చిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ ఓ అప్‌డేట్‌ను విడుదల చేశాడు. త్వరలోనే ఈ సినిమా రెండో ట్రైలర్ ను విడుదల చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతుండగా.. రెండో ట్రైలర్ ఖచ్చితంగా ఉందని, తమన్ ఇచ్చిన మ్యూజిక్‌తోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. మరి ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ […]

Written By: Shiva, Updated On : February 27, 2022 12:05 pm
Follow us on

Prabhas Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. మార్చిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ ఓ అప్‌డేట్‌ను విడుదల చేశాడు. త్వరలోనే ఈ సినిమా రెండో ట్రైలర్ ను విడుదల చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతుండగా.. రెండో ట్రైలర్ ఖచ్చితంగా ఉందని, తమన్ ఇచ్చిన మ్యూజిక్‌తోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. మరి ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

Prabhas Radhe Shyam Movie

ఇక ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యే థియేటర్స్‌లో జ్యోతిష్కులతో ఒక అస్ట్రాలజీ చెప్పే కౌంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అంటే.. సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఫ్రీగా జ్యోతిషం చెప్పుంచుకోవచ్చు అన్నమాట. మరి ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.

ఇక ఓ లవ్‌స్టోరి ఇండస్ట్రీ రికార్డు కొట్టడం చాలా అరుదు. ఇప్పటివరకు మాస్‌, ఫ్యామిలీ చిత్రాలే తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి. లవ్‌ అండ్‌ రొమాన్స్‌ క్యేటగిరీలో ఇప్పటివరకు ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ఖుషీ చిత్రమనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్‌ రాధేశ్యామ్‌తో వస్తుండగా, ఖుషీ రికార్డుని బ్రేక్‌ చేసే సత్తా పుష్కలంగా ఉన్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి.

Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

ఇక రాధేశ్యామ్ కనీసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే టాల్ బ్యూటీ పూజా హెగ్డేకి 4 కోట్లు రెమ్యునరేషన్ ను ఇచ్చారు. కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.

అయితే, ‘రాధేశ్యామ్’ సినిమాని మొదటి నుంచి ఓవర్ గా ప్రమోట్ చెయ్యట్లేదు. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదు అన్నట్టే టీమ్ ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను చాలా సింపుల్ గా కట్ చేశారు. ప్రభాస్ స్టార్ హీరో అయినా, పాన్ ఇండియా స్టార్ హీరో అయినా కేవలం పరిపూర్ణమైన ప్రేమ కథతోనే ఈ సినిమా సాగుతుందని ఎలివేట్ చేస్తూ వస్తున్నారు.

Also Read: కంగనా రనౌత్ ‘లాక్ అప్ షో’ కి షాక్ !

Tags