Star kids failure in Tollywood: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తమకంటూ ఒక స్ట్రైచర్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అయిన అఖిల్ సైతం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. తను ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటినా కూడా సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఇప్పుడు లెనిన్ సినిమాతో మరోసారి తన లక్కును పరీక్షించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తన నుంచి వచ్చిన ప్రతి సినిమా డిజాస్టర్లను ముట్టకట్టుకోవడమే తప్ప భారీ సక్సెసులనైతే సాధించడం లేదు. ఇక హీరో మెటీరియల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సక్సెస్ లను సాధించడంలో మాత్రం వెనుకబడిపోతున్నాడనేది ఎవరికీ క్లారిటీ రావడం లేదు…
ఇక ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ అతని ఇమేజ్ ను పెంచడంలో ఎలాంటి సహకారం అందించడం లేదు. కాబట్టి లెనిన్ సినిమాతో ఆయన డిజాస్టర్ ని మూటగట్టుకుంటే మాత్రం అతను ఇక షెడ్డుకి వెళ్లి పోవాల్సిందే అంటూ సినిమా మేధావులు కామెంట్లు చేస్తున్నారు…ఇక నితిన్ లాంటి హీరో సైతం ఇండస్ట్రీకి వచ్చి 24 సంవత్సరాల కెరియర్ ను పూర్తి చేసుకున్న కూడా తను స్టార్ హీరోగా మారలేకపోతున్నాడు.
నితిన్ వల్ల నాన్న ప్రొడ్యూసర్ అనే విషయం మనకు తెలిసిందే…దాంతో ఆయన హీరో అయ్యాడు. కానీ నితిన్ అప్పటినుంచి ఇప్పటి వరకు అడపాదడపా సక్సెస్ లను సాధించిన కూడా అందులో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవలేకపోతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా విషయంలో క్లారిటిని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
అందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ఆయన ఫెడౌట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. సినిమా బ్యా గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ లు వస్తాయి సూపర్ స్టార్లు మారిపోతాం అనుకోవడం మూర్ఖత్వం… ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు స్టార్ హీరోలుగా అవతరించారు. ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా రాణించలేకపోయిన నటులు కూడా ఉన్నారు…
