RTI Movie: వరలక్ష్మీ శరత్ కుమార్, రవి శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఆర్టీఐ. రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక రోల్ చేశారు. ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. 2005లో భారత ప్రభుత్వ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ తీసుకొచ్చింది. ఈ ఆర్టీఐ చట్టం ప్రకారం… దేశంలోకి ప్రతి పౌరుడు ప్రభుత్వాలు, వాటి విధానాలు, చట్టాలు, వివిధ సంఘటనలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.
పౌరులు నియమాల పరిధిలో ఎలాంటి సమాచారం గురించి అడిగినా ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. ఈ ఆర్టీఐ చట్టం గురించి సామాన్య జనాలకు తెలిసింది తక్కువే. ఈ యాక్ట్ ని ఉపయోగించుకునే వారి సంఖ్య వేలల్లో కూడా లేదు. సమాజానికి ఉపయోగపడే ఈ యాక్ట్ గురించి సామాన్యులకు తెలియాలనే ఉద్దేశంతో ఆర్టీఐ చిత్రాన్ని తెరకెక్కించారు.
దీన్ని ఓ ఆసక్తికర కథనంతో కోర్ట్ రూమ్ డ్రామాగా మలిచి తెరకెక్కించారు. ఆర్టీఐ మూవీ సెప్టెంబర్ 23 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కానుంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్ కి చెందిన ఈటీవీ విన్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్. ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్, షోలతో పాటు అనేక సినిమాలు, సిరీస్లు ఈటీవీ విన్ లో అందుబాటులో ఉన్నాయి.
ఫ్యూచర్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ దే అని నమ్మిన శాటిలైట్ సంస్థలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ స్థాపిస్తున్నాయి. సన్ నెట్వర్క్, జీ, సోనీ, స్టార్ మా ఛానల్స్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కలిగి ఉన్నాయి. ఆ మధ్య ఈటీవి విన్ లో స్ట్రీమ్ అయిన నైంటీస్-మిడిల్ క్లాస్ బయోపిక్ విశేష ఆదరణ పొందింది. జనాలకు విపరీతంగా నచ్చేసింది.
ఆర్టీఐ సైతం ప్రేక్షకులను అలరించడం ఖాయం. వరలక్ష్మి, రవి శంకర్ మధ్య కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతంగా ఉంటుందని సమాచారం. మరి ఆలస్యం చేయకుండా ఈటీవీ విన్ లో ఆర్టీఐ మూవీ చూసేయండి.
Web Title: Informative thriller rti movie in ott
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com