Indraja and Krishna Bhagavan
Krishna Bhagavaan: నటి ఇంద్రజ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. మరో వైపు బుల్లితెర పై తన హవా సాగిస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. కాగా లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ లో కృష్ణ భగవాన్ పై ఇంద్రజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృష్ణ భగవాన్ లో ఉన్న మరో యాంగిల్ ఆమె బయటపెట్టింది.
ఈ నేపథ్యంలో కమెడియన్ నూకరాజు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్కిట్ చేసాడు. యాంకర్ గా మారి అందరిని ఒక ఆట ఆడుకున్నాడు. ఇందులో నూకరాజు నత్తి వాడిగా భలే నటించాడు. ర అక్షరం బదులు ల పలుకుతూ నవ్వులు పూయించాడు. కమెడియన్స్ నుంచి జడ్జెస్ వరకు అందరిని ఇంటర్వ్యూ చేస్తూ ఫన్నీ గా ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో జడ్జ్ కృష్ణ భగవాన్ దగ్గరకు వెళ్లి .. ‘ మీకంటే ముందు ఈ సీట్లో నాగబాబు, మనో గారు ఉన్నారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఏమనిపిస్తుంది అని అడుగుతాడు.
ఈ సీట్ నాకే సరిపోలేదు .. మరి వాళ్లకి ఎలా సరిపోయిందని అనిపిస్తుంది అని కృష్ణ భగవాన్ చెప్తారు. ఆ తర్వాత ఇంద్రజ తో .. ఈ సీట్లో గతంలో మీతో పాటు కూర్చున్న మనో గారిపై, ఇప్పుడు మీ పక్కనే ఉన్న జడ్జి గారి పై మీ అభిప్రాయం ఏంటని అడుగుతాడు నూకరాజు. సింగర్ మనో గారు పాటగాడు .. ఇక కృష్ణ భగవాన్ పెద్ద ఆటగాడు అని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.
ఇంద్రజ మాటలకు సెట్ మొత్తం గొల్లుమంది. అంతా తెగ నవ్వేశారు. సైలెంట్ గా ఉంటూ ఒక్కసారిగా అంత మాట అనేసరికి కృష్ణ భగవాన్ షాక్ కు గురైయ్యారు. కాగా నూకరాజు చేసిన స్కిట్ నవ్వులు పూయిస్తుంది. ఇంద్రజ పంచులు హైలెట్ గా నిలిచాయి. ఈ క్రమంలో నెక్స్ట్ ఎపిసోడ్ పై అంచనాలు ఏర్పడ్డాయి.
Web Title: Indraja sensational comments on krishna bhagavan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com