Dil Raju : సాధారణంగా సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన బయ్యర్స్ తమకి లాభాలు వచ్చాయా?, లేదా నష్టాలు వచ్చాయా అనేది స్పష్టంగా చెప్పరు. ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయితే తప్ప, యావరేజ్, లేదా సూపర్ హిట్ టాక్ వచ్చిన చిత్రాలకు లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా చివరికి లాభాలు వచ్చాయి అనే చెప్తారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ పబ్లిక్ గా చెప్తే ఇతర నిర్మాతల మనోభావాలు దెబ్బ తింటాయి. బిజినెస్ సీక్రెట్స్ ని బహిరంగంగా ఎలా చెప్తారు అని అసంతృప్తి వ్యక్తం చేస్తారు. నిన్న దిల్ రాజు చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బయ్యర్స్ ఈ నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ నిన్న ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. వాళ్లకు వచ్చిన లాభాలు చెప్పుకొని సంతోషపడకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని గెలికేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా సూపర్ హిట్స్ అని చెప్పుకుంటున్న సినిమాల నుండి మేము ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని, లాభాలు రాకపోయినా వచ్చినట్టు చెప్పుకున్నామని అన్నాడు. అంటే కల్కి, దేవర, పుష్ప2 చిత్రాల నుండి బయ్యర్స్ కి ఏమి మిగలలేదు అన్నమాట. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. దిల్ రాజు కూడా అదే వేదికపై ఈ మాటలను సమర్ధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకపక్క మాకు నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినట్టే బయట చెప్పాలి, లేకపోతే నిర్మాతలు మాకు సినిమాలు ఇవ్వరు అని చెప్తూనే, ఇండస్ట్రీ లో ఉన్న అసలు గుట్టు మొత్తాన్ని బయట పెట్టేశారు. దీంతో అనేక మంది నిర్మాతలు మీ సినిమా సూపర్ హిట్ అయితే ఎంజాయ్ చేయాల్సిందిపోయి, మాకు నష్టం కలిగేలా ఎందుకు మాట్లాడిస్తున్నారు అంటూ కాల్స్ చేశారట.
రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో లాభాలు మేము అందుకున్నది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి మాత్రమే అని బయ్యర్స్ చెప్పడం పై చిరంజీవి అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2023 సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి భారీ లాభాలు వచ్చాయి. పెట్టిన ప్రతీ పైసా కి రెండు రూపాయిలు కలిసొచ్చింది. కానీ రెండేళ్ల నుండి మాకు లాభాలు లేవని బయ్యర్లు చెప్పడం హాస్యాస్పదం అని అంటున్నారు. లాభాలు లేకపోతే ‘పుష్ప 2 ‘ చిత్రాన్ని ఇంకా థియేటర్స్ లో ఎందుకు నడిపిస్తున్నారు. ఒక సినిమా థియేటర్ లో రన్ అవ్వడం అంటే ఎంత ఖర్చు అవుతుంది?, అదంతా ఎందుకు భరించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. మొత్తం మీద ఒకే ఒక్క సక్సెస్ మీట్ తో దిల్ రాజు ఇండస్ట్రీ మొత్తాన్ని గిల్లి వదిలేశాడని విశ్లేషకులు అంటున్నారు. మరి సోషల్ మీడియా లో వస్తున్న ఈ కామెంట్స్ పై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.